Chandrababu House: చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనలు
టీడీపీ జాబితాలో సీట్లు దక్కని నేతలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాపై పలువురు నేతలు, ఆ నేతల కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. తొలి జాబితాలో చాలా మంది నేతలకు టికెట్ దక్కలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గం టికెట్ ఆశించిన గొల్ల శంకర్ యాదవ్ అనుచరులు సోమవారం చంద్రబాబు ఇంటివద్ద ఆందోళన చేపట్టారు. పెట్రోల్ క్యాన్ లతో వచ్చి తంబళ్లపల్లె టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని, పెట్రోల్ క్యాన్ లను తీసేసుకున్నారు. దీంతో శంకర్ యాదవ్ అనుచరులు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దాసరి పల్లె జయచంద్రారెడ్డిని చంద్రబాబు ఎంపిక చేశారు. శంకర్ యాదవ్ అనుచరులు జయచంద్రారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.
టీడీపీ జాబితాలో సీట్లు దక్కని నేతలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలతో ఆదివారం నాడు చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. కొందరు నేతలకు హామీలు, మరి కొందరి నేతలకు టీడీపీ అధినేత పలు విషయాల్లో స్పష్టత ఇచ్చారు. ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమా, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్న, ముక్కా రూపానంద రెడ్డిలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వారందరికి చంద్రబాబు కీలక హామీలు ఇచ్చారు.