ఓ లెక్చరర్‌ అమ్మాయిల పట్ల 'ప్రేమ'గా ఉండేవాడు. ఆ ప్రేమలో కామం దాగుందని గుర్తించలేకపోయారు. మంచివాడన్న ముసుగు వేసుకొని విద్యార్థినులతో మాటలు కలిపేవాడు. ఆ తర్వాత విద్యార్థినుల ఫోన్‌ నెంబర్లు తీసుకొని వారితో చాటింగ్‌ చేసేవాడు. వారి ఆర్థిక అవసరాలనే ఆసరాగా చేసుకున్నాడు. అన్నింటికీ తానున్నట్లు నమ్మబలికాడు. రానురాను ఆ లెక్చరర్‌ ఆగడాలకు అంతులేకుండా పోయింది. వాట్సాప్‌లో ఇష్టారీతిన ఫొటోలు, వీడియోలు పంపించేవాడు.

ఓ లెక్చరర్‌ అమ్మాయిల పట్ల 'ప్రేమ'గా ఉండేవాడు. ఆ ప్రేమలో కామం దాగుందని గుర్తించలేకపోయారు. మంచివాడన్న ముసుగు వేసుకొని విద్యార్థినులతో మాటలు కలిపేవాడు. ఆ తర్వాత విద్యార్థినుల ఫోన్‌ నెంబర్లు తీసుకొని వారితో చాటింగ్‌ చేసేవాడు. వారి ఆర్థిక అవసరాలనే ఆసరాగా చేసుకున్నాడు. అన్నింటికీ తానున్నట్లు నమ్మబలికాడు. రానురాను ఆ లెక్చరర్‌ ఆగడాలకు అంతులేకుండా పోయింది. వాట్సాప్‌లో ఇష్టారీతిన ఫొటోలు, వీడియోలు పంపించేవాడు. తన చెప్పినట్లు నడుచుకుంటే అన్నీ తానై చూసుకుంటానని చెప్పాడు. స్నానం చేస్తున్న వీడియోలను(Bathing videos) పంపాలని విద్యార్థినులను కోరేవాడు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో(Puttaparthi) ఓ ప్రైవేట్‌ జూనియర్ కాలేజ్‌లో(Private junior college) ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాలు చూస్తే.. ఓ లెక్చరర్‌ విద్యార్థినులతో మంచిగా ఉన్నట్టు కొన్ని రోజులు నటించాడు. విద్యార్థినుల ఫోన్ నంబర్లు తీసుకొని వారితో చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత మెల్లగా విద్యార్థినులకు అసభ్య మెసేజ్‌లు పంపేవాడు. అన్నింటికీ తాను ఉన్నానని, చెప్పినట్లు చేయాలని ఆదేశించేవాడు. ఇలా ముగ్గురు విద్యార్థునిలను స్నానం చేస్తున్న వీడియోలు పంపాలని బలవంతం చేశాడు. అయితే ముగ్గురు విద్యార్థినులలో ఓ విద్యార్థిని స్నానం చేసే వీడియోలు పంపింది. ఇక ఇదే అదునుగా భావించిన లెక్చరర్‌ ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఇటు కుటుంబ సభ్యులు, అటు కాలేజీ యజమాన్యానికి చెప్పుకోలేక ఆ విద్యార్థిని మనసిక క్షోభ అనుభవించింది. దీంతో ఆ లెక్చరర్‌పై పలు ఫిర్యాదులు వచ్చాయి. లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated On 4 March 2024 6:12 AM GMT
Ehatv

Ehatv

Next Story