President Draupadi Murmu : నేడు పుట్టపర్తిలో రాష్ట్రపతి పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సత్యసాయి జిల్లా పుట్టపర్తికి రానున్నారు. పర్యటనలో భాగంగా సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.

President Draupadi Murmu visit to Puttaparthi today
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) బుధవారం సత్యసాయి జిల్లా(Satyasai District) పుట్టపర్తి(Puttaparthi)కి రానున్నారు. పర్యటనలో భాగంగా సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్(Sathya Sai Institute of Higher Learning) 42వ స్నాతకోత్సవం(Graduation Ceremony) లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.35 గంటలకు జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం కార్యక్రమానుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ(Delhi) బయలుదేరి వెళతారు.
