తాజాగా ప్రముఖ నటుడు, రాజకీయ నేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) కు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్(Prakaj raj) మధ్య ట్విట్టర్ వేదికగా ఒక సలహా ఇచ్చారు.

తిరుమల శ్రీవారి లడ్డూ(Tirumala laddu) కల్తీ జరిగిందన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. పవిత్రమైన లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో(Animal fat) చేసిన నెయ్యిని వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు(CM chandrababu) చెప్పడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జగన్‌(Jagan) కూడా దీటుగా స్పందించారు. రాజకీయాల కోసం ఇంతటి నీచానికి దిగజారుతావా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 100 రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లడ్డూను రాజకీయాల్లోకిలాగారని జగన్‌ విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) కూడా లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే అభిప్రాయాన్ని చెప్పారు. అయితే దీనిపై నటుడు ప్రకాష్‌రాజ్‌(Prakash Raj) సీరియస్‌గా స్పందించారు. పవన్‌ కల్యాణ్‌.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఇది జరిగిందంటున్నారు. నిజంగా జరిగితే దోషులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే దేశంలో ఉన్న మతకల్లోలాలు చాలవన్నట్లు దీన్ని ఎందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని చూస్తున్నారు? అని అసహనం వ్యక్తం చేశారు. దోషులను గుర్తించడం మానేసి ఆందోళనలను జాతీయస్థాయిలో వ్యాంపింపచేయడం కరెక్ట్‌ కాదని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ప్రకాష్‌రాజ్‌ హితవు పలికారు

Updated On 21 Sep 2024 5:18 AM GMT
Eha Tv

Eha Tv

Next Story