ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లో నిలకడలేనితనం ఎక్కువ! ఎంత ఎక్కువ అంటే నిన్న అన్నది ఇవాళ అనకపోవడం..

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లో నిలకడలేనితనం ఎక్కువ! ఎంత ఎక్కువ అంటే నిన్న అన్నది ఇవాళ అనకపోవడం.. ఇవాళ అన్నది రేపు మర్చిపోవడం..! అందుకే విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ జస్ట్‌ ఆస్కింగ్ (Prakash Raj)అంటూ వపన్‌ను నిలదీస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, ఆయన ట్వీట్లకు కౌంటర్లు ఇవ్వలేక తెగ ఇబ్బందిపడుతున్నారు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan). ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మ(Sanathana Dharma) పరిరక్షకుడి అవతారం దాల్చారు. కాషాయం దుస్తులతో కొత్త స్వామిగా తయారయ్యారు. ప్రకాశ్‌రాజ్‌కు వచ్చే సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి. పచ్చి రాజకీయ అవకాశవాదిగా పవన్‌ను అభివర్ణించారంటే ప్రకాశ్‌రాజ్‌కు ఆయన గురించి చాలా తెలుసన్నమాటే! జోకర్లను లీడర్లుగా చేస్తే మనం చూడాల్సింది సర్కస్సే అని పేర్లు ప్రస్తావించకుండా ప్రకాశ్‌రాజ్‌ అన్నారు కానీ అది ఎవరికి తగలాలో వారికి తగిలే ఉంటుంది. ప్రకాశ్‌రాజ్‌లాగే ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శి కె.ఎన్‌.మల్లీశ్వరి(K.N Malliswari) సూటి ప్రశ్నలను సంధించారు. సాక్షి పత్రిక ఎడిట్‌ పేజీలో ఆమె రాసిన తూర్పు తీరం వ్యాసంలో పవన్‌ తీరును చక్కగా ఎండగట్టారు. పవన్‌ నిలకడతనాన్ని ప్రశ్నించారు. కుదురుగా లేని ఆయన భావాలను సుతిమెత్తగా తిట్టిపోశారు. తరం మారకుండానే స్వరం మార్చిన పవన్‌ కల్యాణ్‌ అధికారలోకి రాగానే వేషభాషలు కూడా మార్చేశారని విమర్శించారు. తిరుపతి సభలో పవన్ ఇచ్చిన వారాహి డిక్లరేషన్‌ ఏమిటో, దాని సారాంశమేమిటో ఎంత ప్రయత్నించినా కొంచెం కూడా అర్థం కావడం లేదన్నారు. ఇదే సమయంలో ఆమె పవన్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. డిప్యూటీ సీఎంగా ల‌డ్డు (Tirumala Laddu)నాణ్య‌త మీద రోజుల త‌ర‌బ‌డి పోరాడ‌టం ముఖ్య‌మా? లేక క‌నీస అవ‌స‌రాలు తీర‌ని పేద ప్ర‌జ‌ల కోసం ఏవైనా చేయ‌డం ముఖ్య‌మా? అని అడ‌గం. మెల్లిగా తెలుగుదేశాన్ని ప‌క్క‌కు జ‌రిపి, జ‌న‌సేన‌(Janasena), బీజేపీ(BJP)తో ఎటువంటి రాజ‌కీయం చేయ‌బోతోంది అని కూడా అడ‌గ‌ము, స‌రేనా! కానీ జ‌స్ట్ ఆస్కింగ్‌. స‌నాత‌న ధ‌ర్మం అంటే ఏంటి? బోర్డులు, గ‌ట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయ‌బోతున్న పోరాట‌పు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్ప‌గ‌ల‌రా? వ‌ర్ణ వ్య‌వ‌స్థ ఇందులో భాగ‌మా, మ‌నుధ‌ర్మ శాస్త్రం ఏమైనా ప‌రిపాల‌నకి దిక్సూచి కానుందా? స్త్రీల‌ను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవ‌కులుగా, శ్రామిక కులాల‌ను అంట‌రానివారిగా నిశ్చ‌యం చేయ‌బోతున్నారా? మ‌తి ఎంతో గ‌తి అంతే అన్న‌ది మీకు ఇష్ట‌మైన కొటేష‌న్‌. ఇప్పుడు స‌నాత‌న హిందూగా మీ మ‌తి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌మైన మా గ‌తిని ఎలా మార్చ‌బోతోందో తెలుసుకోవాల‌ని జ‌స్ట్ ఆస్కింగ్‌. ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్యమంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు' అంటూ క్లాస్‌ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) సమాజాన్ని ఏం చేయాలని అనుకుంటున్నావ్‌ సామీ అని మల్లిశ్వరి వేసిన ప్రశ్నకు జనసేనాని ఏమని సమాధానం ఇస్తారు? ఆయన మహిళలను ఇంట్లోనే కూర్చోవాలని అనుకుంటున్నారా? ద‌ళితుల్ని బానిస‌లుగా, కార్మికుల్ని అంట‌రాని వారిగా చూడాల‌ని అనుకుంటున్నారా? పవన్‌ అంతటి అయోమయ రాజకీయనాయకుడిని ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండం. భవిష్యత్తులో చూస్తామన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే పవన్‌లాంటి వ్యక్తి మరొకరు ఉండరు కాబట్టి! ఏదో ప్రజలకు ఇంత మేలు చేస్తారని ఎన్నిక చేసుకుంటే, ఆయనేమో సనాతన ధర్మమంటూ వేషాలేసుకుని తిరుగుతున్నారు. పదేళ్ల కిందట తనను తాను చే గువేరా రిప్లికాగా చెప్పుకున్న పవన్‌ ఇప్పుడు సనాతనిగా మారిపోయారు. కుల మత రహిత సమాజాన్ని ఆకాంక్షించిన ఆయన ఇప్పుడు హిందూత్వ ఎజెండా ఎత్తుకున్నారు. రేపొద్దున బీజేపీతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఎత్తుగడ ఇందులో ఉంటే ఉండవచ్చు. కానీ ఇలా తడవతవడకు అభిప్రాయాలను మార్చుకుంటే ఎలా? మల్లీశ్వరి వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగితే కోట్లాది ప్రజల అనుమానాలను తీర్చిన వారవుతారు పవన్‌ కల్యాణ్‌..

ehatv

ehatv

Next Story