ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్న

ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్న భారీ సభ అని చెప్పారు. లక్షల్లో జనం వస్తారని చెప్పారు. కానీ తీరా చూస్తే జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి నిర్వహించిన ప్రజాగళం ఒక అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయిందని అంటున్నారు జనం. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఊహించని విమర్శలు చేస్తారని అనుకోగా.. అలాంటిదేమీ చేయలేదు. టీడీపీ స్క్రిప్ట్ ను నరేంద్ర మోదీ చదవలేకపోయారు. ఇక జనం కూడా చాలా తక్కువ ఉండడంతో ప్రజాగళం కాస్తా ఏ మాత్రం ప్రజా మద్దతు లేని షోగా మిగిలిపోయింది. 15 లక్షల మందితో భారీ సభ అంటూ ప్రచారం చేశారు. అయితే సభకు చాలా తక్కువ మంది వచ్చారు. ఇది కూడా కూటమికి షాకింగ్ గా నిలిచింది.

ప్రధాని మోదీ ప్రసంగం మొదలైన వెంటనే మైకు మొరాయించడంతో ఆయన రెండు నిముషాలు మాట్లాడడం ఆపేయాల్సి వచ్చింది. మోదీ మాట్లాడే సమయంలో మూడుసార్లు మైకులు ఆగిపోయాయి. మోదీ వేదిక మీదకు వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడే సమయంలో టీడీపీ కార్యకర్తలు సౌండ్‌ బాక్స్‌ టవర్లను ఎక్కారు. ప్రధాని మోదీ వారిని చూసి ఏదైనా జరగరానిది జరిగితే ఇబ్బందులు వస్తాయని.. దయచేసి దిగాలంటూ కోరారు. ఇలా ఎన్నో ఇబ్బందుల మధ్య ప్రజాగళం సాగింది.

Updated On 17 March 2024 8:20 PM GMT
Yagnik

Yagnik

Next Story