Pothina Venkat Mahesh : జనసేనకు పోతిన గుడ్‌బై..! అనుకున్నది సాధించిన టీడీపీ
పోతిన వెంకట్ మహేశ్(Pothina Venkat Mahesh)... జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ను(Pawan kalyan) వీసమెత్తు మాట అన్నా సహించేవారు కాదాయన! పవన్‌కు వీరభక్తుడాయన! పదేళ్ల నుంచి జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ, పార్టీ కార్యకలాపాలను దిగ్విజయంగా నడిపిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపారు.
పోతిన వెంకట్ మహేశ్(Pothina Venkat Mahesh)... జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ను(Pawan kalyan) వీసమెత్తు మాట అన్నా సహించేవారు కాదాయన! పవన్‌కు వీరభక్తుడాయన! పదేళ్ల నుంచి జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా ఉంటూ, పార్టీ కార్యకలాపాలను దిగ్విజయంగా నడిపిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జనసేనకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు తన రాజీనామా లేఖను పంపారు. లేఖలో "జనసేన పార్టీలో నాకున్న పదవీ బాధ్యతలకు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఇప్పటి వరకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు, పెద్దలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు"అని రాసుకొచ్చారు పోతిన వెంకట్ మహేశ్. ఈ పరిణామాన్ని ఎవరూ ఊహించి ఉండరు. పవన్ కలలో కూడా తలపోసి ఉండరు. పవన్ గట్టిగా నిలబడి ఉంటే మహేశ్ కూడా ఉండేవారు. కానీ పవన్ టీడీపీకి(TDP) దాసోహమయ్యారు. నిజానికి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ స్థానాన్ని పోతిన ఆశించారు. గత ఎన్నికల్లో ఆయన ఇక్కడ్నుంచే పోటీ చేశారు. విజయం దక్కకపోయినా గణనీయమైన ఓట్లను సాధించారు. ఓటమితో కుంగిపోకుండా నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేస్తూ వచ్చారు. ఇప్పుడా సీటు బీజేపీకి(BJP) వెళ్లింద. ఏలా చూసినా విజయవాడ వెస్ట్‌లో బీజేపీకి అనుకూలం కాదు. ఆ పార్టీకి కొంచెం కూడా బలం లేదు. పోతిన మహేశ్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి, పాలిటిక్స్‌లో ఆయనకు ఫ్యూచర్ లేకుండా చేయాలనే కుట్రతో తెలుగుదేశంపార్టీనే ఆ సీటు బీజేపీకి వెళ్లేలా చేసిందనే చర్చ అయితే జరుగుతోంది. తమకు దక్కకపోయినా ఫర్వాలేదు కానీ జనసేనకు మాత్రం విజయవాడ వెస్ట్ దక్కకూడదని టీడీపీ అనుకుంది. చివరకు అనుకున్నది సాధించింది.జనసేన నుంచి అయితే పోతిన వెళ్లిపోయారు. ఇప్పుడాయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది.