YSRCP Supreme Court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైసీపీ
పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై ఎన్నికల సంఘం ఆదేశాలపై జోక్యం చేసుకోవద్దని
పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై ఎన్నికల సంఘం ఆదేశాలపై జోక్యం చేసుకోవద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మే 30న కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై కీలక ఆదేశాలు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయని తెలిపింది. ఈ ఉత్తర్వుల్ని కొట్టివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. ఈ అంశంపై విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏదైనా ఉత్తర్వులు జారీచేసే ముందు కోర్టు తన వాదనలు కూడా వినాలని సుప్రీం కోర్టులో వెలగపూడి తరఫున న్యాయవాది గుంటూరు ప్రభాకర్ ఈ కేవియట్ పిటిషన్ ఫైల్ చేశారు.