Posani Krishna Murali : జగన్‌ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
జగన్‌ను చంపేస్తానన్న బాబు వ్యాఖ్యలపై ఎవరూ స్పందించరా..? చంద్రబాబు వ్యాఖ్యలు మోదీ, అమిత్ షాలకు
వినపడలేదా..? ఫేక్ వీడియోలకు ఉన్న విలువ.. ఏపీ సీఎం ప్రాణాలకు లేదా..? అని APFDC ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.

Posani Krishna Murali Sensational Comments on Chandrababu
జగన్‌ను చంపేస్తానన్న బాబు వ్యాఖ్యలపై ఎవరూ స్పందించరా..? చంద్రబాబు వ్యాఖ్యలు మోదీ, అమిత్ షాలకు
వినపడలేదా..? ఫేక్ వీడియోలకు ఉన్న విలువ.. ఏపీ సీఎం ప్రాణాలకు లేదా..? అని APFDC ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుజనా చౌదరి, సీఎం రమేష్ ఆర్ధిక నేరస్థులు. సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీలోకి ఎందుకెళ్లారు..? అని ప్రశ్నించారు. 2014లో మోదీ, బాబు, పవన్ ఫొటోలు మేనిఫెస్టోపై వేశారు.. 600 హామీల్లో ఒక్క హామీనైనా నెరవేర్చారా..? అని ప్రశ్నించారు. దొంగ హామీల బాబు ఒక్కటి కూడా చేయడు.. చంద్రబాబు వస్తే జగన్ ఇచ్చిన ఇళ్లను వెనక్కి తీసుకుంటాడని అన్నారు.
చంద్రబాబు వస్తే ఇంగ్లిష్ మీడియం బడులు మూసేస్తాడన్నారు. చంద్రబాబు మనవడు మాత్రమే ఇంగ్లిష్ బడుల్లో చదవాలా..? అని ప్రశ్నించారు. బాబు మేనిఫెస్టోపై తన ఫొటో ఉండకూడదని మోదీ చెప్పారు.. బాబు హామీలకు తనది బాధ్యత కాదని మోదీ అన్నారు. ప్రజలు కూడా బాబు మోసపూరిత హామీలు తెలుసుకోవాలని పోసాని కృష్ణ మురళి అన్నారు.
