Posani Krishna Murali : తెలంగాణాలో ఉన్న ఆంధ్రులకు పోసాని కృష్ణ మురళి విన్నపం, ఏమన్నారంటే..?
తెలంగాణాలో(Telanagna) జరగబోతున్న ఎన్నికలపై(Elections) స్పందించారు సినీనటుడు పోసాని కృష్ణ మురళీ(Posani Krishna Murali). ఈ ఎలక్షన్ లో ఓటు(Vote) ఎవరికి వెయ్యాలీ అనేదానిపై తన అభిప్రయం చెప్పడంతో పాటు.. అందరూ తాను అనుకున్నవారికే ఓటు వెయ్యండి అంటూ వేడుకున్నారు. ఇంతకీ పోసాని ఎవరికి ఓటు వేయమ్మానంటే..?
తెలంగాణాలో(Telanagna) జరగబోతున్న ఎన్నికలపై(Elections) స్పందించారు సినీనటుడు పోసాని కృష్ణ మురళీ(Posani Krishna Murali). ఈ ఎలక్షన్ లో ఓటు(Vote) ఎవరికి వెయ్యాలీ అనేదానిపై తన అభిప్రయం చెప్పడంతో పాటు.. అందరూ తాను అనుకున్నవారికే ఓటు వెయ్యండి అంటూ వేడుకున్నారు. ఇంతకీ పోసాని ఎవరికి ఓటు వేయమ్మానంటే..?
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హీటు కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ఎలక్షన్స్ జరగనుండటంతో.. అధికార ప్రతి పక్షాలు పోటా పోటీ ప్రచారం(Campaign) నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో ఈసారి బీఆర్ఎస్(BRS) కు కాంగ్రెస్(Congress) గట్టి పోటీ ఇస్తుండగా.. ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈక్రమంలో హైదరాబాద్(Hyderabad) తో పాటు ఆంధ్రా వారు ఎక్కువగా ఉన్న ఖమ్మం(Khammam), నల్గొండ(Nalgonda) బాడర్ లో ఎవరు గెలుస్తారు అన్నది ఉత్కంటగా మారింది. ఈక్రమంలో ఆ ఓట్లు కూడా బీఆర్ఎస్ పడేట్టుగా ప్రయత్నాలు గట్టిగాసాగుతున్నాయి. ఈక్రమంలో ఈ విషయంలో స్పందించారు నటుడు, వైసీపీ(YCP) నేత పోసాని కృష్ణ మురళీ. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న సీమాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని పోసాని కృష్ణమురళి కొనియాడారు.
రాష్ట్రంలో ఏపీ, తెలంగాణ ప్రజలంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉన్నారని... కేసీఆర్(KCR) పాలనలో రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందని.. ప్రశంసించారు. తక్కువ కాలంలోనే హైదరాబాద్ ను న్యూయార్క్(New York) కు పోటీ వచ్చేలా అభివృద్ధి చేశారని అన్నారు. ఇక మిషన్ భగీరథ గురించి ఎంత చెప్పినా తక్కువేనని... నెహ్రూ నుంచి ఈరోజు వరకు ఏ ప్రధాని కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేయలేదని పోసాని అన్నారు. రాష్ట్రంలో ఏ ట్యాప్ తిప్పినా తాగునీరు వస్తోందని అన్నారు.
ఇక ఇక్కడ ఏదో అన్యాయం జరిగింది అని అంటున్నారు. కాని ఎక్కడా అనేది చూపింలేకపోతున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంటున్నారే కానీ... అవినీతి ఎక్కడ జరిగిందనేని ఇంతవరకు నిరూపించలేకపోయారని విమర్శించారు. మేడి గడ్డ బ్యారేజీలో ఒక్క పిల్లర్ కుంగిపోతే ఊళ్లు ఎలా మునిగిపోతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో చెరువులన్నీ నీటి కళను సంతరించుకున్నాయని... ఎక్కడ చూసినా పచ్చటి పంట పొలాలు కనిపిస్తున్నాయని చెప్పారు.