వైఎస్ వివేకా హత్య కేసులో(Viveka Murder Case) ప్రముఖ వెబ్‎సైట్ ది వైర్ సంచలన కథనం ప్రచురించింది. వివేకా హత్య కేసులో సీబీఐ(CBI) దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్‎ ఆధారంగా పలు అంశాలను లేవనెత్తింది. కేవలం ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ వివేకా హత్య కేసును దర్యాప్తు చేసి, విచారణను ముగించిందని వివరించింది. మొత్తానికి సీబీఐ ఛార్జిషీట్‎లో అసంబంద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవన్నది ది వైర్ కథనం.

వైఎస్ వివేకా హత్య కేసులో(Viveka Murder Case) ప్రముఖ వెబ్‎సైట్ ది వైర్ సంచలన కథనం ప్రచురించింది. వివేకా హత్య కేసులో సీబీఐ(CBI) దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్‎ ఆధారంగా పలు అంశాలను లేవనెత్తింది. కేవలం ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ వివేకా హత్య కేసును దర్యాప్తు చేసి, విచారణను ముగించిందని వివరించింది. మొత్తానికి సీబీఐ ఛార్జిషీట్‎లో అసంబంద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవన్నది ది వైర్ కథనం.

ఏపీలో అంత్యంత సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదాంతంపై సీబీఐ ఫైనల్ ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా మర్డర్ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి ఛార్జిషీటు దాఖలుకు ఏకంగా 474 రోలజులు తీసుకుంది. మొత్తం 259 మంది సాక్షుల అభిప్రాయాలను సేకరించి వివేకా హత్యకు రాజకీయ(Politics) కారణాలు, కుటుంబ విభేదాలే(Family issues) కారణమని చెప్పింది. అయితే వివకా హత్య కేసులో సీబీఐ చాలా అంశాలను వదిలివేసిందని, కేవలం అసంబంద్ధమైన కథనాలను వండీవార్చిందని ది వైర్ సీబీఐ తీరును ఏకరువుపెట్టింది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు ఏపీలో సంచలనం రేపుతోంది. వివేకా హత్య జరిగినప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎన్నో అరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. ఇప్పటికీ ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీబీఐ ఫైనల్ ఛార్జిషీట్‎ను కోర్టులో దాఖలు చేసింది. అందులో చాలా విషయాలను సీబీఐ వదిలేసిందని ది వైర్ వెబ్‎సైట్ సంచలన కథనాన్ని ప్రచురించింది.

2019 మార్చి 15న అర్ధరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆ సమయంలో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ఉన్నారు. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. సాధారణ ఎన్నికలకు నెల రోజుల ముందు వైఎస్ వివేకా హత్య జరిగింది. టీడీపీ నేతలే(TDP Leaders) వివేకాను చంపారని వైఎస్ జగన్(YS Jagan) ఆరోపించారు. వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలని జగన్‎తోపాటు వివేకా కుటుంబ సభ్యులు పిటిషన్లు(Petitions) వేశారు. అయితే అదే సమయంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు(Chandra babu) సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా జీవో జారీ చేశారు.

2020లో ఏపీలో ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ సీఎం అయ్యారు. అదే ఏడాది మార్చి 11న ఏపీ హైకోర్టు(High Court) వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. అయితే కోర్టు తీర్పు తర్వాత కేసు నమోదుకు సీబీఐ 120 రోజుల సమయం తీసుకుంది. వివేకా హత్య కేసుపై దర్యాప్తు మొదలు పెట్టిన సీబీఐ 2021 అక్టోబర్‎లో 474 రోజుల తర్వాత మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఎర్రగంగిరెడ్డి(Erra Gangi Reddy), సునీల్ యాదవ్(sunil Yadav), శ్రీఉమాశంకర్(Shri Uma Shankar), దస్తగిరి(Dhastagiri) పేర్లను అందులో నమోదు చేసింది. హత్యకేసులో పలు ఆధారాలను ఉదయ్ కుమార్‎రెడ్డి, భాస్కర్‎రెడ్డి, అవినాష్ రెడ్డిలు(avinash Reddy) చెరిపేశారంటూ హత్య, కుట్ర పలు సెక్షన్ల కింద కేసులు పెట్టిన సీబీఐ దర్యాప్తును ది వైర్‎వెబ్ సైట్ అనేక ఎపీసోడ్‎లుగా వివరించింది.

వివేకా హత్యకేసులో సీబీఐ ఛార్జిషీట్ల ప్రకారం దర్యాప్తు పూర్తయిందో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేసింది ది వైర్ వెబ్‎సైట్. వాటిలో చాలా అంశాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వివేకా హత్య జరిగిన 1558 రోజుల తర్వాత సీబీఐ ఫైనల్ రిపోర్టు ఇచ్చింది. ఫైనల్ ఛార్జిషీట్ పరిశీలిస్తే..ఎన్నో అంశాలను సీబీఐ వదిలేసినట్టుగా తెలుస్తోందన్నది ది వైర్ వెబ్‎సైట్ వాదన. సీబీఐ ఛార్జిషీట్‎లోని 8వ పేజీలో 14వ పేరాలో హత్యకుట్ర వెనుక ఉద్దేశాలపై వివరణ ఉంది.
వైఎస్ కుటుంబం చరిత్ర అంతా అందరికీ తెలిసిందే..వైఎస్ వివేకా హత్య కడప ఎంపీ సీటు కోసమేనని సీబీఐ ఫైనల్ ఛార్జిషీట్‎లో తేల్చేసింది. కడప ఎంపీ సీటును అవినాష్‎కు కాకుండా షర్మిలకు ఇప్పిస్తారనే భయంతోనే వివేకాను హత్య చేశారని ఉంది. ఇంత పెద్ద సెన్షేషనల్ మర్డర్ కేసులో సీబీఐ తేల్చింది ఇదా..? అంటూ వైర్ వెబ్‎సైట్ వివేకా మర్డర్ కేసును పూర్తిగా స్కానింగ్ చేసి చెప్పింది.

ఛార్జిషీట్‎లో సీబీఐ చెప్పిన రాజకీయ నాయకులపై ది వైర్ వెబ్‎సైట్ ఫోకస్ చేసింది. కొన్ని కారణాల వల్ల ఫైనల్ ఛార్జిషీట్‎లో సీబీఐ వైఎస్ కుటుంబ మూలాలను ప్రస్తావించింది. ఛార్జిషీట్‎లో 16, 23 పేరాల ప్రకారం 2017లో ఎమ్మెల్సీగా ఓడిపోయిన వివేకా..2019 ఎన్నికల కోసం వివేకా యాక్టివ్ అయినట్లు ఉంది. కానీ కడప ఎంపీ సీటు అవినాష్‎కు బదులు, షర్మిలకుగానీ, విజయమ్మకుగానీ, తనకుగానీ ఇవ్వాలని వివేకా చెప్పారు. వైఎస్ అవినాష్ సమర్ధుడు కాదు అంటూనే అవినాష్‎కు జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరాడు. దీనిపై వైర్‎ వెబ్‎‎సైట్ కథనం ప్రకారం.. హత్య జగిరిన సమయంలో.. అంతకుమందు వివేకా యాక్టివ్ పొలిటీషియన్ కాదని వైర్ అంటోంది. కానీ సీబీఐ మాత్రం వివేకా యాక్టివ్ పొలిటీషియన్ అని ఛార్జిషీట్‎లో చెప్పింది. 2004 తర్వాత రాజకీయాల్లో వివేకానందరెడ్డి యాక్టివ్‎గా లేరు. హత్యకు పదిహేనేళ్ల క్రితం మాత్రమే వివేకా యాక్టివ్‎గా ఉన్నట్టు ది వైర్ చెబుతోంది. దీనికి వివేకా కుమార్తె సునీత ఇచ్చిన స్టేట్‎మెంట్లే ఆధారం. హత్య సమయానికి తన తండ్రి రాజకీయాల నుంచి రిటైర్డ్ అయినట్లుగా రెండుస్లార్లు సీబీఐకి సునీత స్టేట్‎మెంట్లు ఇచ్చారు.

2011లో విజయమ్మ చేతిలో ఓడిపోయాక వివేకా క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్డ్ అయినట్లుగా సునీత స్టేట్‎మెంట్ ఇచ్చారు. 2019లో కడప ఎంపీ సీటు కోసం వివేకా సమర్ధుడని చాలా మంది తనతో చెప్పినా..తన తండ్రి అప్పటికే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్టుగా సునీత స్టేట్‎మెంట్ ఇచ్చారట. హత్యకు ముందు ఎనిమిదేళ్లపాటు వివేకా ఎలాంటి పబ్లిక్ మీటింగ్ పెట్టలేదు. 2011లో కాంగ్రెస్ నుంచి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే..తన ఆఫీస్‎లో ప్రజలతో కలిశారు. ఆ తర్వాత విజయమ్మ చేతిలో ఓడిపోయాక కాంగ్రెస్ వివేకాను పట్టించుకోలేదు.

2019లో మార్చి 10న ఎన్నికల నోటికేషన్ విడుదల అయ్యింది. మార్చి 17న అభ్యర్థుల వివరాలు ప్రకటించాల్సినప్పటికీ మార్చి 19న సీఎం జగన్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే అవినాష్‎రెడ్డి ఎంపీగా ఉన్నారు. 2014 కడప ఎన్నికల్లో అవినాష్‎రెడ్డికి 1.90 లక్షల ఓట్ల మెజారిటీ ఉంది. అలాంటప్పుడు అవినాష్‎రెడ్డి బీ ఫామ్ కాండిడేట్ ఎలా అవుతాడని ది వైర్ ప్రశ్నిస్తోంది. అవినాష్ ఎన్నికల రికార్డును పరిశీలిస్తే.. ఆయన బలమైన అభ్యర్థని వైర్ వ్యాఖ్యానిస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అవినాష్‎రెడ్డి 3.80 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫ్యాక్షనిస్టు ఆదినారాయణరెడ్డిని సైతం ఓడించారు. మొదట కాంగ్రెస్‎లో ఉన్న ఆదినారాణరెడ్డి టీడీపీలోకి వచ్చి, ఆ తర్వాత బీజేపీలో చేరారు.

సునీత భర్త రాజశేఖర్ రెడ్డి సైతం..అవినాష్ రెడ్డి ఎంపీ టికెట్‎పై సీబీకి స్టేట్‎మెంట్ ఇచ్చారు. అవినాష్‎రెడ్డి ఎంపీ అభ్యర్థి అంటూ మర్డర్‎కు ముందు అవినాష్ కోసం వివేకా ప్రచారం చేసినట్టుగా రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. వివేకానంద సోదరి విమల సైతం కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డేనని చెప్పినట్టుగా ది వైర్ అంటోంది. కడప ఎంపీ సీటు అవినాష్‎కేనని, అవినాష్ కోసమే వివేకా ప్రచారం నిర్వహించారని వివేకా సోదరి విమల వైర్‎తో చెప్పారట. అనవసరంగా అవినాష్‎ని ఇబ్బంది పెడుతున్నారని విమల అన్నారట. సొంత కుటుంబ సభ్యులే వివేకా క్రియాశీల రాజకీయాల నుంచి రిటైర్డ్ అయినట్టు చెబుతుంటే..సీబీఐ మాత్రం వివేకా యాక్టివ్ పొలిటీషియన్ అని చెబుతోందని, కుటుంబ సభ్యులు చెబుతున్న వాదనని సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదని ది వైర్ ప్రశ్నిస్తోంది.

వివేకా హత్య ఎపీసోడ్ లో సీబీఐ చాలా అంశాలను విస్మరించిందని ది వైర్ చెబుతోంది. ప్రతి అంశాన్ని ఫోకస్ చేసింది. ఛార్జిషీట్లో వైఎస్ కుటుంబ మూలాలను కూడా సీబీఐ ప్రస్తావించింది. వైఎస్ ముత్తాత ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి..ఇవ్వన్నీ ఛార్జిషీట్‎లో వివరించింది.

వివేకా హత్య జరిగిన రెండేళ్లకు వైఎస్ షర్మిల జగన్‎కు దూరమయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిలతో విజయమ్మ కలిశారు. జగన్, షర్మిల మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు..కానీ షర్మిలతో వివేకానందరెడ్డి మాట్లాడారా లేదా అన్నదానికి ఎలాంటి ఆధారం లేదు. రాజ్యసభ సీటు విషయంలో అన్న చెల్లెళ్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. 2021 జులైలో హైదరాబాద్‎లో షర్మిల పార్టీని స్థాపించారు. అయితే అన్నా చెల్లెళ్ల మధ్య వివేకా ఏం చెప్పారన్నది ఎవరికీ తెలియదు. వివేకా కడప ఎంపీ సీటుపై ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. దాన్ని జగన్ పట్టించుకొని ఉండకపోవచ్చు. ఏదేమైనా 2011 పరిణామాల తర్వాత వివేకా యాక్టివ్ పాలిటిక్స్‎లో లేరనిది వైర్ అభిప్రాయం.

2009లో వైఎస్ రాజశేఖర్‎రెడ్డి చనిపోయిన తర్వాత ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సోనియాగాంధీ జగన్‎కు అవకాశం ఇవ్వలేదు. అదే సమయంలో వివేకా జగన్‎తో కాకుండా కాంగ్రెస్‎నే సపోర్టు చేశారు. దీనికి బదులుగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‎రెడ్డి వివేకాకు ఎమ్మెల్సీతోపాటు వ్యవసాయశాఖ మంత్రి పదవి ఇచ్చారు. అప్పటికే కడప ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేశారు. కడప ఎంపీ సీటుతోపాటు పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ రెండు స్థానాలపై వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి కన్నేశారు. 2008లోనే అమెరికా నుంచి వచ్చిన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని, సోనియాగాంధీని కలవాలని కుటుంబ సభ్యులంతా ఢిల్లీ వెళ్లారు. అయితే సోనియగాంధీ కలిసే అవకాశం ఇవ్వలేదు. కానీ పులివెందుల ఎమ్మెల్యే టికెట్‎ను వైఎస్ వివేకాకు ఇచ్చారు. అప్పటికే మంత్రిగా చేసిన వివేకా విజయమ్మపై పోటీ చేశారు. వివేకాకు కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‎రెడ్డి, మరో అల్లుడు శివప్రకాష్ మద్దతు తెలిపారు. అయితే వదిన విజయమ్మ చేతిలో ఓడిపోయిన వివేకాను ఆ తర్వత కాంగ్రెస్ పక్కన పెట్టింది. దీంతో వివేకానందరెడ్డి మళ్లీ జగన్‎తో కలిసి నడిచారు.

సీబీఐ ఫైనల్ ఛార్జిషీట్‎లోని 16, 21 పేరాల ప్రకారం 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివశంకర్‎రెడ్డి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ జగన్ వివేకాకు టికెట్ ఇవ్వడంతో భాస్కర్‎రెడ్డి, శివశంకర్‎రెడ్డి, అవినాష్‎రెడ్డి కలిసి వివేకాను ఓడించారనేది సీబీఐ అభియోగం. తన ఓటమికి ఈ ముగ్గురే కారణమని వివేకా తిట్టినట్లుగా సీబీఐ ఛార్జిషీట్‎లో పేర్కొంది. ఎన్నికల్లో ఓడిపోతే సాధారణంగానే ఉద్వగ్న పరిస్థితులుంటాయి. రాయలసీమ ప్రాంతాల్లో అధికారమే సర్వంగా భావిస్తారు. కానీ 2017లో ఓటువేసిన ఏ ఒక్క ఓటర్ స్టేట్‎మెంట్ సీబీఐ చార్జిపీట్‎లో తీసుకోలేదు. దాదాపు 800 మంది ఓటర్లు ఓటు హక్కను వినియోగించుకున్నారు. ఏ ఒక్క ఓటర్ స్టేట్‎మెంట్‎ను ఛార్జిషీట్లో పొందుపరచలేదు. మరోవైపు వివేకానందరెడ్డి మీద గెలిచిన బీటెక్ రవిని సైతం సీబీఐ విచారించలేదు. ఎలాంటి ఆధారం లేకుండానే హత్యానేరం ‎ఎలా మోపారు? కాబట్టి వివేక హత్యకు రాజకీయ ఉద్దేశాలే కారణమని సీబీఐ ఎలా చెబుతుందని ది వైర్ వెబ్‎సైట్ ప్రశ్న.

ఎంతో అనుభవం ఉన్న ఒక రాజకీయ నేత తిట్టారని ఎవరైనా హత్య చేస్తారా? 2019లో వివేకా హత్యకు గురయ్యారు. అప్పుడు ఎన్నికల హడావిడి ముందు పెట్టుకొని ఎప్పుడో రెండేళ్ల క్రితం తమని తిట్టారని, ఏ లీడరైనా హత్యకు పాల్పడతారా? 2014, 2019 ఎన్నికల్లో అవినాష్‎రెడ్డి లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారని సీబీఐ మరిచిపోయింది. సీబీఐ ఛార్జిషీట్ ప్రకారం భాస్కర్‎రెడ్డి కుటుంబం ఎప్పుడో రాజకీయాల్లో ఉండాలి అనుకున్నారు. కానీ వైఎస్ రాజశేఖర్‎రెడ్డి వారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానివ్వలేదు. అదే సమయంలో తమ్ముడు వైఎస్ వివేకాను రాజశేఖర్‎రెడ్డి ప్రోత్సహించారు. దాంతో రాజకీయాల్లో రాజశేఖర్‎రెడ్డి, వివేకానంద‎రెడ్డి కుటుంబాలే రాజకీయాల్లో ఆ‎ధిపత్యం చెలాయించేవి అన్నది అందరికీ తెలిసిన విషయమేనని వైర్ చెబుతోంది.

వైఎస్ కుటుంబ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. వైఎస్ ముత్తాత వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మి, రెండో భార్య మంగమ్మ. భాస్కర్‎రెడ్డి, అవినాష్‎రెడ్డి మొదటి భార్య లక్ష్మీ కుటుంబానికి చెందినవారు. రెండో భార్య మంగమ్మ కుటుంబానికి చెందినవారే వైఎస్ రాజశేఖర్‎రెడ్డి, వివేకానందరెడ్డి. భాస్కర్‎రెడ్డికి, వివేకాకు ముత్తాత వెంకటరెడ్డి ఒక్కరే అయినప్పటికీ తల్లులు వేరు. కాబట్టి జగన్, అవినాష్ సవతి మనవళ్లు. అందుకే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని సీబీఐ ఛార్జిసీట్‎లో చెప్పింది. భాస్కరెడ్డి సోదరి కుమార్తె భారతిని జగన్ వివాహం చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ఈ పెళ్లితో విభేదాలు తగ్గాయని సీబీఐ అంటోంది.

రాజశేఖర్‎రెడ్డి మరణం తర్వాత వివేకాతోపాటు నర్రెడ్డి కుటుంబం అధికారం కోసం పాకులాడాయి. కానీ జగన్ వెంట నిలిచింది భాస్కర్‎రెడ్డి, భారతి మాత్రమే. జగన్ జైల్లో ఉన్న సందర్భంలో పదేళ్ల కష్టకాలంలో వెన్నంటి నడిపించింది భాస్కర్‎రెడ్డి కుటుంబమే. పాలిటిక్స్ నుంచి రిటైర్డ్ అయ్యాక వివేకా ఎక్కువగా పులివెందులలోనే ఉండేవారు. హార్ట్ ఆపరేషన్ జరిగి ఆరు నెలలు కూడా కాకముందే వైఎస్ వివేకా భార్య హైదరాబాద్‎లో ఉంటున్న కుమార్తె దగ్గరకు వెళ్లిపోయారు. ఏడాదికి రెండుసార్లు మాత్రమే సునీత.. తండ్రి వివేకా దగ్గర ఉండేవారు. నర్రెడ్డి రాజశేఖర్‎రెడ్డితో వివేకాకు వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో తరచు కలుస్తుండేవారని సీబీఐకి సునీత ఇచ్చిన వాంగ్మూలం. 2011 నుంచి తనకు తండ్రితో సఖ్యత లేదని సునీత సీబీఐకి మరో స్టేట్‎మెంట్ ఇచ్చారు. వివేకానందరెడ్డి రెండో భార్యనంటూ షమీం అనే మహిళ భయటకొచ్చాక నాన్నతో సునీత దూరం ఉంటూ వచ్చారు. ఏడాదికి ఒకటి రెండుసార్లు మాత్రమే కలిసేదాన్నని సీబీఐకి సునీత ఇచ్చిన రికార్డులో ఉంది. షమీం గురించి తెలిశాక వివేకా కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు బెదిరించినట్టుగా షమీం సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.

2011లో అక్బర్ షేక్‎గా పేరు మార్చుకున్న వివేకా..షమీంను తన భార్యగా ఇంట్లో వారికి కూడా వివేకా పరిచయం చే‎శారు. అప్పటి నుంచి వివేకా కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. షమీం స్టేట్‎మెంట్ ప్రకారం వివేకా తనను భాగా చూసుకున్నారని చెప్పింది. 2018లో హార్ట్ సర్జరీ తర్వాత తనతోపాటు తన కొడుక్కి ఏమీ చేయలేకపోతున్నానని వివేకా బాధపడినట్లు షమీం సీబీఐకి ఇచ్చిన రికార్డులో ఉంది. తన కొడుక్కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‎లో అడ్మిషన్ ఇప్పిస్తానని చెప్పారు..ఒక ఇల్లు కట్టించడంతోపాటు ఫిక్స్‎డ్ డిపాజిట్ చేసి, వ్యవసాయ భూమిని తన కొడుకు పేరు మీద రాయిస్తానని వివేకా చెప్పినట్టు సీబీఐ ఎదుట షమీపం స్పష్టం చేశారు. షమీం స్టేట్‎మెంట్ ప్రకారం వివేకా మరణానికి కొన్ని రోజుల ముందే చెక్ పవర్ తొలగించారు. దీంతో వివేకా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వివేకా కేర్ టేకర్ రాజశేఖర్ స్టేట్‎మెంట్ ప్రకారం..చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో వివేకా ‎ఆందోళన చెందినట్లుగా స్టేట్‎మెంట్ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సునీల్, దస్తగిరిలతో వివేకా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఫైనాన్షియల్ ఇబ్బందులతో వివేకా మోతాదుకు మించిన మద్యం సేవించేవారు. కొన్నిసార్లు ఒత్తిడి తట్టుకోలేక వివేకా నేలమీదే పడుకునేవారని కేర్ టేకర్ రాజశేఖర్‎రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వివేకా ఆర్థిక పరిస్థితి గురించి పులివెందులలో చాలా మందికి తెలుసు. 8 మంది దగ్గరి నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయాలు వివేకా అప్పుగా తీసుకున్నారు. అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‎రెడ్డి ఫ్యాక్టీరి కోసం వివేకా 4 కోట్లు ఖర్చు పెట్టారని వైర్ వెబ్‎సైట్ వివరంగా చెబుతోంది. తన తండ్రికి క్రెడిట్ స్కోర్ లేనందువల్ల, కొన్ని మార్పులు చేయాలనుకున్నామని, అందుకే నాన్నకు చెక్ పవన్ తీసేశామని, అయినా తన తండ్రి పేరు మీదు రూ. 50 కోట్ల ఆస్తులున్నాయని, భర్త నిర్వహిస్తున్న వ్యాపారాలకు తను డైరెక్టర్‎గా వ్యవహరిస్తున్నానని సునీత సీబీఐకి చెప్పారు. అయితే వివేకానందరెడ్డి తర్వాత తన డైరెక్టర్ హోదా నుంచి భర్త పేరును సునీత తొలగించారు. వివేకాకు డబ్బు అవసరమైతే నర్రెడ్డి శివప్రసాద్‎రెడ్డితోపాటుగా రాజశేఖర్‎రెడ్డి(Rajeshekar Reddy) కూడా ఇచ్చేవారు. వివేకా పేరు మీద ఉన్న 93 ఎకరాలను సునీత సౌభాగ్యమ్మ పేరు మీదకు మళ్లించారు. ఇక షమీం తనకు డబ్బులు కావాలని తమను ఎప్పుడూ సంప్రదించలేదని సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం .. మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీ క్రిస్టియన్ రెడ్డీస్‎గా కన్వర్ట్ కావడంతో అటు టీడీపీ, ‎ఇటు బీజేపీ వారిపై విమర్శలు చేస్తూ వచ్చేది. వీరికి క్రిస్టియానిటీ నుంచి ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయని వారిపై విమర్శలు చేసేవారు. నర్రెడ్డి రాజశేఖర్‎రెడ్డి యూఎస్ పౌరుడు కావడంతో ఆ సమస్యను పక్కన పెట్టారు. సీబీఐ ఛార్జిషీట్‎లో పేర్కొన్న అంశాలు, చేసిన ఆరోపణలు చూస్తే కుటుంబ కలహాలు, ఎదుగుదలను అడ్డుకోవడమే హత్యకు ప్రధాన కారణాలుగా సీబీఐ అభియోగాలు మోపింది. కేసు మొత్తాన్ని డ్రైవర్ దస్తగిరి, వాచ్‎మెన్ రంగన్న స్టేట్‎మెంట్లతోనే దర్యాప్తు చేసింది. వారు నిజం చెబుతున్నారని గ్యారంటీ ఏమిటి? కేసు మొత్తాన్ని కుటుంబ విభేదాల కేంద్రంగానే దర్యాప్తు చేసింది తప్ప.. వివేకా హత్యలో బయటివారి ప్రమేయం ఏంటన్నది సీబీఐ వెలికితీయలేకపోయిందన్నది వైర్ వెబ్‎సైట్ ప్రశ్న. సీబీఐ ఫైనల్ ఛార్జిషీట్‎లోని అంశాల్ని ప్రస్తావించిన వైర్ వెబ్‎సైట్.. సెకండ్ ఎపీసోడ్‎లో మరిన్ని అంశాల్ని వివరంగా చెబుతానంటోంది.

Updated On 23 July 2023 7:14 AM GMT
Ehatv

Ehatv

Next Story