తెలుగు సినీ అభిమానులకు నటి పూనమ్‌ కౌర్‌ను(Poonam Kaur) కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ రాజకీయపార్టీ అభిమానులకు కూడా పూనమ్‌ కౌర్‌ చిరపరిచితురాలే! సోషల్‌ మీడియాలో(Social media) ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. ఆమె పెట్టే ప్రతీ పోస్టు సంచలనమే! ఏదో ఒక గూడార్థం అందులో ఉంటుంది.

తెలుగు సినీ అభిమానులకు నటి పూనమ్‌ కౌర్‌ను(Poonam Kaur) కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ రాజకీయపార్టీ అభిమానులకు కూడా పూనమ్‌ కౌర్‌ చిరపరిచితురాలే! సోషల్‌ మీడియాలో(Social media) ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. ఆమె పెట్టే ప్రతీ పోస్టు సంచలనమే! ఏదో ఒక గూడార్థం అందులో ఉంటుంది. సామాజిక, రాజకీయ అంశాలపై ఆమె తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. పవన్‌కల్యాన్‌(Pawan kalyan) టార్గెట్‌గా ఇప్పటికే చాలా పోస్టులు పెట్టారామె! అసలు పవన్‌తో గొడవ ఏమిటో ఆమె ఎప్పుడూ చెప్పలేదు. లేటెస్ట్‌గా ఆమె సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఓ రకంగా అది ప్రకటనే! తనను రాజకీయంగా కొందరు పావుగా వాడుకుంటున్నారని అందులో తెలిపారు. ఆమె ఏం చెప్పారంటే 'అందరికీ నమస్కారం.

ఇప్ప‌టి వ‌ర‌కూ నేను ఏ రాజ‌కీయ పార్టీ కండువా వేసుకోలేదు. ఏ రాజ‌కీయ పార్టీకి సంబంధించిన వ్య‌క్తిని కాను. స‌మ‌స్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మ‌ధ్య కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు వారి ప్ర‌యోజ‌నాల కోసం న‌న్ను ఓ పావుగా వాడాల‌ని అనుకుంటున్నారు. ఇది స‌ముచితం కాదు. ఒక మ‌హిళ‌పై ఇలాంటి కుట్ర‌లు . మ‌రి కొంద‌రు నాయ‌కులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కు బిడ్డ‌ను, త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు. ద‌య‌చేసి మీ రాజ‌కీయాల కోసం న‌న్ను లాగకండి.

ప్ర‌స్తుతం నేను చేనేత‌, మ‌హిళా ఉద్య‌మాల‌ను జాతీయ స్థాయిలో నిర్మించే ప‌నిలో వున్నాను. నా వైపు నుంచి ఏదైనా అప్డేట్ వుంటే నేనే స్వ‌యంగా తెలియ‌జేస్తాను" అని పూనమ్‌ కౌర్‌ చెప్పుకొచ్చారు. ఆమెను రాజకీయాల కోసం ఎవరు వాడుకుంటున్నారనే దానిపై నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ఆ మధ్యన వారాహి యాత్రలో(Varahi Yatra) పవన్‌కల్యాణ్‌ ప్రసంగిస్తూ వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించడం, దానికి పూనమ్‌ కౌర్‌ పరోక్షంగా సెటైర్లు వేయడం తెలిసిందే!

ఈ ఏడాది జూలై 16న ఆమె చేసిన ట్వీటేమిటంటే 'మహిళా భ‌ద్ర‌త‌ గురించి గొంతెత్తే నాయ‌కులు రెజ్లర్ల నిరసన సమయంలో మాత్రం నోరు మెద‌ప‌లేదు. ఇలాంటి ఫేక్ లీడర్లతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లకి అనుకూలంగా, అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతుంటారు. జాగ్రత్తగా ఉండండి' అని ఏపీని హ్యాష్ ట్యాగ్‌గా పెట్టారు. ప‌వ‌న్ పేరు ఎత్త‌కుండా ఆమె ట్వీట్‌ చేసినప్పటికీ అది పవన్‌ గురించేనని ఇట్టే గుర్తుపట్టేయవచ్చు.

Updated On 25 Sep 2023 5:28 AM GMT
Ehatv

Ehatv

Next Story