Polling Percentage in AP: ఇదీ ఏపీలో నమోదైన పోలింగ్ శాతం
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదయింది.
తిరువూరు నియోజకవర్గం చింతలకాలనీలో అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గొటివాడ అగ్రహారం, విశాఖ జిల్లా పద్మనాభం మండలం, భీమునిపట్నంలోనూ పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది.
అల్లూరి సీతారామరాజు - 63.19 శాతం
అనకాపల్లి - 81.63 శాతం
అనంతపురం - 79.25 శాతం
అన్నమయ్య - 76.12 శాతం
బాపట్ల - 82.33 శాతం
చిత్తూరు - 82.65 శాతం
అంబేద్కర్ కోనసీమ - 83.19 శాతం
తూర్పు గోదావరి - 79.31 శాతం
ఏలూరు - 83.04 శాతం
గుంటూరు - 75.74 శాతం
కాకినాడ - 76.37 శాతం
కృష్ణా - 82.20 శాతం
కర్నూలు - 75.83 శాతం
నంద్యాల - 80.92 శాతం
ఎన్టీఆర్ - 78.76 శాతం
పల్నాడు -78.70 శాతం
పార్వతీపురం మన్యం - 75.24 శాతం
ప్రకాశం - 82.40 శాతం
పొట్టిశ్రీరాములు నెల్లూరు - 78.10 శాతం
శ్రీ సత్యసాయి - 82.77 శాతం
శ్రీకాకుళం - 75.41 శాతం
తిరుపతి - 76.83 శాతం
విశాఖపట్నం - 65.50 శాతం
పశ్చిమ గోదావరి -81.12 శాతం
వైఎస్సార్ - 78.12 శాతం