Mudragada Political entry: పొలిటికల్ జంక్షన్లో ఉద్యమ నేత..ముద్రగడ దారెటు?
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారా? ఉద్యమ నేతగా తన సత్తా చాటిన ముద్రగడ..ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? అంటే..తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముద్రగడ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే మూడు ప్రధాన పార్టీలు ముద్రగడను చేర్చుకునేందుకు విశ్వప్రయత్నం చేన్నాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ ఏ పార్టీలో చేరుతారనే అంశం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కుల సమీకరణలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. కాపు ఉద్యమ నేత(Kapu movement leader) ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) క్రియాశీల రాకీయాల్లో(Active Politics)కి రావాలని నిర్ణంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ బంపర్ ఆఫర్ ఇచ్చినా..ముద్రగడ స్పందించలేదని సమాచారం. ఒకవైపు ముద్రగడ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనతో జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్(Janasena leader Bolishetti Srinivas)భేటీ కావడం రాజకీయంగా ప్రధాన్యత సంతరించుకుంది. కాపు సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేతలు సైతం ముద్రగడ జనసేన పార్టీలో చేరాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమి(Tdp-JanaSen alliance)లోకి రావటం ద్వారా మేలు జరుగుతుందని ముద్రగడకు పలువురు సూచిస్టున్నట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena chief Pawan Kalyan)స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్క కు ఓ కండిషన్ కూడా పెట్టారట. తూర్పుగోదావరి జిల్లాలోని రెండు స్థానాలు, నెల్లూరు జిల్లాలోని ఒక స్థానం తమకు కేటాయించాలని పవన్ కల్యాణ్ ను ముద్రగడ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ సంక్రాంతికి పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి.. పార్టీలో చేరే అంశంపై చర్చిస్తారని సమాచారం. కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా ఉన్న ముద్రగడపై అధికార వైసీపీ కూడా సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. ఒకవేళ ముద్రగడ వైసీపీలో చేరితే కాపు ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉంది. అది వైసీపీకి మరింత లబ్ది చేరూరుస్తుందని టీడీపీ-జనసేన కూటమి భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. తాజాగా తెలుగుదేశం నేత జ్యోతుల నెహ్రూ (Tdp Leader Jyotula Nehru) ముద్రగడను కలవడం మరింత ఆసక్తికరంగా మారింది. టీడీపీ-జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు జ్యోతుల నెహ్రూ చెబుతున్నారు. మరి..ముద్రగడ అధికారవైసీపీలో చేరుతారా? టీడీపీ-జనసేన కూటమికి మద్దతు ఇస్తారా? లేదా సైలెంట్ గా ఉంటూ పరోక్ష రాజకీయాలు చేస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఏపీ పొలిటికల్ జంక్షన్ లో ఉన్న ముద్రగడ ఎటువైపు వెళ్తారనేది ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చగా మారింది.