JC Divarkar Reddy : అయ్యో... జేసీ దివాకర్‌రెడ్డి ఇలా అయ్యారేమిటి?
జేసీ దివాకర్‌రెడ్డి(JC Divakar reddy).. రాజకీయాల పట్ల కూసింత ఆసక్తి ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే!
జేసీ దివాకర్‌రెడ్డి(JC Divakar reddy).. రాజకీయాల పట్ల కూసింత ఆసక్తి ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే! తాడిపత్రిని దాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పాపులరైన పేరు. ఎందుకంటే ఆయనో ఫైర్‌బ్రాండ్. రాయలసీమలో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఓటమి ఎరుగని నేత. రాజకీయాలను శాసించిన దివాకర్‌రెడ్డి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. ఎంతో గంభీరంగా కనిపించిన దివాకర్‌రెడ్డి ప్రస్తుతం డీలా పడిపోయారు. అనారోగ్యం ఆయనను కుంగదీసినట్టుగా ఫోటో చూస్తే అర్థమవుతోంది. 80 ఏళ్ల జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్య సమస్యలతో పాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గిందని సన్నిహితులు అంటున్నారు. నడవడానికి కూడా ఇబ్బందిపడుతున్నారట! కొడుకు, మనవడితో కలిసి జేసీ దివాకర్‌రెడ్డి ఉన్న ఫోటోను చూసిన నెటిజన్లు .. అయ్యో.. ఇలా అయ్యారేమిటి అని అనుకుంటున్నారు. .ప్రస్తుతం ఆయన వారసులు రాజకీయాల్లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో జేసీ కుటుంబం నుంచి వారసులు బరిలోకి దిగారు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేయగా, అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనంలో వీరిద్దరు కొట్టుకుపోయారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం కుటుంబంలో ఒకరికే టికెట్ అనే విధానానికి కట్టుబడటంతో.. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. జేసీ దివాకర్ రెడ్డి కొడుకు జేసీ పవన్ రెడ్డికి నామినేటెడ్ పదవి దక్కుతుందనే ఆశతో ఉన్నారు.