ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ నరసన్నపేట(Narasannapeta) నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ధర్మాన సోదరుల ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే క్రిష్ణప్రసాద్(Krishna prasad) లేదా తనయుడు క్రిష్ణ చైతన్య(Krishna chaitanya) పోటీ చేస్తారని వినిస్తుండగా..ఈసారి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada rao) బరిలో దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు అధికార పార్టీలోని లుకలుకలను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న టీడీపీ..బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలని వ్యూహరచన చేస్తోంది.

శ్రీకాకుళజిల్లా(Srikakulam) నరసన్నపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ధర్మాన క్రిష్ణదాస్. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు సోదరుడే క్రిష్ణదాస్. మొదటి నుంచి వైసీపీలో (YSRCP)ఉన్న క్రిష్ణదాస్‎కి తగిన గుర్తింపే ఇచ్చారు సీఎం జగన్(CM Jagan). కేబినెట్‎ కీలకమైన రెవెన్యూ శాఖతోపాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయమే పార్టీలో వర్గ పోరుకు దారితీసింది. అప్పటి వరకూ తాను పోటీ చేసిన నరసన్నపేటను సోదరుడు క్రిష్ణదాస్‎కు వదిలిపెట్టి.. శ్రీకాకుళం నియోజకవర్గానికి మారిపోయారు. కానీ ధర్మాన క్రిష్ణదాస్ మాత్రం సోదరుడి త్యాగాన్ని మరిచి.. అంటీముట్టనట్టు వ్యవహరించారు. క్రిష్ణదాస్ తనయుడు క్రిష్ణ చైతన్య కూడా చిన్నాన్న ప్రసాదరావు వర్గాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. అయితే ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్ (Cabinet)బెర్త్ దక్కిన తర్వాత ఆయన వర్గం యాక్టివ్ అయ్యింది. క్రిష్ణదాస్ వర్గాన్ని తొక్కడం ప్రారంభించారు. దీంతో నరసన్నపేటలో ధర్మాన సోదరుల మధ్య ఆధిపత్య పోరు భగ్గుమన్నది. ధర్మాన సోదారుల మధ్య వైరం పార్టీ కొంపముంచే ప్రమాదం ఉందని కేడర్ ఆందోళన చెందుతోంది.

ఇక నరసన్నపేట వైసీపీలో నెలకొన్న ఆధిపత్యపోరును క్యాష్ చేసుకోవాలని చూస్తోంది టీడీపీ(TDP). అయితే అక్కడ ఇంచార్జీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి(Ramanamurthy) మెతక వైఖరితో పార్టీలో దూకుడు కనిపించడం లేదట. దీంతో ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు(Ram mohan naidu) ఇక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త జోరుగా వినపడుతోంది. మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు తనయుడు బగ్గు శ్రీనివాసరావు కూడా టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారట. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలే టార్గెట్‎గా మార్పులు చేర్పులు చేస్తున్న సీఎం జగన్.. ఈసారి నరసన్నపేట టికెట్ ఎవరికి కేటాయిస్తారు? అనేదానిపై నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీ-టీడీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపించే నియోజకవర్గాల్లో నరసన్నపేట టాప్‎లో ఉండే అవకాశం కనిపిస్తోంది.

Updated On 20 Dec 2023 6:36 AM GMT
Ehatv

Ehatv

Next Story