TDP Bike Rally Protest : ఓఆర్ఆర్ మీదికి వాహనాలతో వెళ్లిన టీడీపీ సానుభూతి పరులు.. పోలీసులు ఏం చేశారంటే..
చంద్రబాబు అరెస్ట్‌ను(Chandrababu Arrest) నిరసిస్తూ టీడీపీ(TDP) సానుభూతి పరులు మరోసారి నిరసనకు సిద్ధమయ్యారు. శేరిలింగం పల్లి నియోజకవర్గానికి చెందిన ఐటీ ఉద్యోగులు(IT Employees), టీడీపీ కార్యకర్తలు ఓఆర్ఆర్‌పైకి(ORR) వాహనాలతో వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను(Chandrababu Arrest) నిరసిస్తూ టీడీపీ(TDP) సానుభూతి పరులు మరోసారి నిరసనకు సిద్ధమయ్యారు. శేరిలింగం పల్లి నియోజకవర్గానికి చెందిన ఐటీ ఉద్యోగులు(IT Employees), టీడీపీ కార్యకర్తలు ఓఆర్ఆర్‌పైకి(ORR) వాహనాలతో(Vehicles) వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ మూడో టోల్ గేటు వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే పటాన్ చెరు ఎగ్జిట్ వద్దకు చేరుకున్న ఆందోళనకారుల వాహనాలను పోలీసులు అడ్డుకుని.. పలువురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి(DSP Purushotham Reddy) చేతికి గాయం అయ్యింది.
టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ.. శాంతియుతంగా చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా సంఘీభావం తెలుపుదామనుకున్న మమ్మల్ని పోలీసులు అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఐటీని ఎంతగానో డెవలప్ చేసిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. వియ్ వాంట్ జస్టిస్, సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.