Police Restrictions On IT Employees : చంద్రబాబు అరెస్టు.. ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై పోలీసుల ఆంక్షలు
చంద్రబాబు అరెస్టుపై(Chandrababu Arrest) తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైద్రాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఐటీ ఉద్యోగులు(IT Employees), టీడీపీ(TDP) నాయకులు ర్యాలీ, మీటింగ్‌లకు ఎటువంటి అనుమతులు లేవని సైబరాబాద్ పోలీసులు(Cyderabad Police) తెలిపారు.

Police Restrictions On IT Employees
చంద్రబాబు అరెస్టుపై(Chandrababu Arrest) తెలంగాణలోనూ నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైద్రాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఐటీ ఉద్యోగులు(IT Employees), టీడీపీ(TDP) నాయకులు ర్యాలీ, మీటింగ్‌లకు ఎటువంటి అనుమతులు లేవని సైబరాబాద్ పోలీసులు(Cyderabad Police) తెలిపారు. ఈ మేరకు మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడలో ఆంక్షలు విధించారు. ఈ రోజు సాయంత్రం మనుకొండ మర్రిచెట్టు కూడలి వద్ద నిరసన కార్యక్రమంతో పాటు.. రేపు నానక్ రామ్ గూడ టోల్ గేట్ నుంచి కార్ల రాలీ నిర్వహించడానికి ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు నిశ్చయించున్నాయి. ఈ రెండు కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.
ఈ విషయమై మాదాపూర్ డీసీపీ(Madhapur DCP) మాట్లాడుతూ.. సైబరాబాద్ లో ధర్నాలకు ఎలాంటి పర్మిషన్ లేదని తెలిపారు. ఎవరైనా నిరసనలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిరసనలతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించవద్దని అన్నారు. ప్రధాన రోడ్లు, ఓఆర్ఆర్ లపై ధర్నా చేయాలనుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆందోళన చేసే ఐటీ ఉద్యోగుల కంపెనీలకు నోటీసులు వెళ్తాయని వార్నింగ్ ఇచ్చారు. సామాన్య ప్రజలకు వారి విధులకు ట్రాఫిక్ కు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
