వైసీపీ(YCP) ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash reddy) పీఏ రాఘవరెడ్డిపై(PA Raghava reddy) పోలీసులు సెర్చ్ వారెంట్(Search warrant) జారీ చేశారు.

వైసీపీ(YCP) ఎంపీ అవినాష్‌రెడ్డి(MP Avinash reddy) పీఏ రాఘవరెడ్డిపై(PA Raghava reddy) పోలీసులు సెర్చ్ వారెంట్(Search warrant) జారీ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి పులివెందుల పోలీసులు నోటీసు అంటించారు. ఏ క్షణంలోనైనా ఇంట్లో సోదాలు(Raids) చేయడానికి అనుమతి తీసుకున్నామని వారు తెలిపారు. వారం రోజుల నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు. మరోవైపు వైసీపీ సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానంద రెడ్డికి పోలీసుల 41-ఎ నోటీసులు జారీ చేశారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్‌నే తాను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశానని వర్రా రవీందర్‌రెడ్డి ఇటీవల పోలీసులకు తెలిపారు. ఈ మేరకు రాఘవరెడ్డి కోసం అతడి స్వగ్రామం అంబకపల్లెలో నిఘాపెట్టి, పులివెందుల, లింగాల మండలాల్లో గాలిస్తున్నారు

Eha Tv

Eha Tv

Next Story