Police complaint on fake IDs : టీడీపీ కుట్రలు.. ఫేక్ ఐడీలతో!!
ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో తిట్టుకోవడాలు చాలా కామన్. అయితే ఇలాంటి సందర్భాల కోసమే కొందరు ఫేక్ అకౌంట్లు కావాలనే సృష్టిస్తూ ఉంటారు.

Police complaint on fake IDs
ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో తిట్టుకోవడాలు చాలా కామన్. అయితే ఇలాంటి సందర్భాల కోసమే కొందరు ఫేక్ అకౌంట్లు కావాలనే సృష్టిస్తూ ఉంటారు. ఈ విషయంలో టీడీపీ నేతలు పలు అకౌంట్లు సృష్టించారని వైసీపీ(YCP) నేతలు పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు. కుట్రపూరితంగా టీడీపీ నేతలు పోస్టింగ్‌లు చేస్తూ బురద చల్లేందుకు యత్నాలు ముమ్మరం చేశారని వైఎస్సార్ జిల్లా పులివెందుల నివాసి వర్రా రాఘవరెడ్డి(Varra Raghava Reddy) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జనవరి 26వతేదీ నుంచి తన పేరుతో కొందరు ఫేక్ ఐడీ సృష్టించి పోస్టులు పెడుతున్నట్లు గుర్తించిన ఆయన 28న పులివెందుల ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి(Arun Reddy)కి ఫిర్యాదు చేశారు. ఏపీ పీసీపీ చీఫ్ షర్మిల(YS Sharmila)ను అసభ్యంగా దూషిస్తూ ఫేక్ ఐడీ(Fake IDs) ద్వారా పోస్టులు చేస్తున్నారని, ఫేక్ ఐడీని ట్రేస్ చేయాలని రాఘవరెడ్డి పోలీసులను కోరారు. జనవరి 31న వైఎస్సార్ జిల్లా(YSR Kadapa District) ఎస్పీ సిద్ధార్థ కౌశల్(Siddharth Kaushal)కు కూడా ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా(YS Viveka) కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత(Sunitha) తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలిని దూషిస్తున్నారని వర్రా రాఘవరెడ్డి పేరుతో ఉన్న ఫేక్ ఐడీ వివరాలను హైదరాబాద్ పోలీసులకు అందచేశారు. తన పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తప్పుడు పోస్టులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం వెనుక ఐ– టీడీపీ శ్రేణులున్నాయని వర్రా రాఘవరెడ్డి ఆరోపించారు.
