ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నంద్యాల పోలీసులు షాకిచ్చారు. నంద్యాల అసెంబ్లీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నంద్యాల పోలీసులు షాకిచ్చారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీలో నిలిచారు. శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ గత పదిహేనేళ్లుగా స్నేహితులు కావడంతో తన మిత్రుడు శిల్పా రవి కోసం అల్లు అర్జున్ సతీసమేతంగా నంద్యాలకు వచ్చారు. శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. అయితే అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.

రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది.

Updated On 11 May 2024 11:06 AM GMT
Yagnik

Yagnik

Next Story