గీతాంజలి(Gitanjali ) అనే పేదింటి అమ్మాయిని అత్యంత రాక్షసంగా పొట్టన పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా(TDP social media ) కార్యకర్తలలో ఆ శాడిజం ఇంకా అలాగే ఉంది. చనిపోయిన తర్వాత కూడా గీతాంజలిపై అడ్డమైన రాతలు రాసి శునకానందాన్ని పొందుతున్నారు. గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును(Rambabu) పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు.

గీతాంజలి(Gitanjali ) అనే పేదింటి అమ్మాయిని అత్యంత రాక్షసంగా పొట్టన పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియా(TDP social media ) కార్యకర్తలలో ఆ శాడిజం ఇంకా అలాగే ఉంది. చనిపోయిన తర్వాత కూడా గీతాంజలిపై అడ్డమైన రాతలు రాసి శునకానందాన్ని పొందుతున్నారు. గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రాంబాబును(Rambabu) పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. విజయవాడ సింగ్‌నగర్లో రాంబాబును తెనాలి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరి మిగతా వారి మాటేమిటి? వారిని కూడా వెనువెంటనే అరెస్ట్ చేసి సోషల్‌ మీడియా అరాచకాన్ని నిలువరించాలి. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్లు కడుపుకు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారు తెలియదు. ప్రభుత్వం తనకు ఇల్లు ఇచ్చిందని చెప్పినందుకు సోషల్‌ మీడియాలో ఆమెపై ఇష్టం వచ్చినట్టుగా అడ్డమైన రాతలు రాశాయి టీడీపీ సోషల్‌ మీడియా. పేదింటి అమ్మాయి మొహంలో చిరునవ్వు కూడా చూడలేకపోతున్నారు ఈ దగుల్బాజీలు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. గీతాంజలిని పొట్టనపెట్టుకున్నది ఈ ముఠానే! గత అయిదేళ్లుగా టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఇదే పని! మహిళలు, విద్యార్థలను టార్గెట్‌గా చేసుకుని సోషల్‌ మీడియాలో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ రెండు పార్టీలకు సోషల్‌ మీడియా ట్రోల్స్‌ కోసం ప్రత్యేకంగా ఆఫీసులు ఉన్నాయి. అందులో ఉన్న వందలాది మందికి పొద్దున్న లేచినకాడి నుంచి పడుకునే వరకు ఇదే పని! పేదలకు ఇళ్లు వస్తే సహించలేరు. వైఎస్‌ఆర్‌ ఆసరా వస్తే భరించలేరు. రైతు భరోసా వస్తే తట్టుకోలేరు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఆనందపడితే ఓర్చుకోలేరు. చివరకు న్యాయవ్యవస్థపై కూడా అవాకులు చవాకులు పేలుతుంటారు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదంటున్నారు ప్రజలు. సోషల్‌ మీడియాలో ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు పోలీసలు. 67 ఐటీ చట్టం కింద గరిష్టంగా అయిదేళ్ల వరకు జైలు శిక్షపడుతుంది. దాంతో పాటే జరిమానా కూడా! ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను టార్గెట్‌గా చేసుకుని వేధింపులకు గురి చేస్తే ఐపీసీ సెక్షన్‌ 354 ప్రకారం అయిదేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఉద్దేశపూర్వకంగా మహిళలను మాటలతోనో, చేతలతోనో వేధిస్తే ఐపీపీ 509 సెక్షన్‌ ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒకరిని వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తే ఐపీసీ 306 సెక్షన్‌ ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. దాంతో పాటే జరిమానా కూడా! ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నేరుగా వేధిస్తే ఐపీసీ సెక్షన్‌ 120 ఏ కింద జైలుకు పంపవచ్చు.

Updated On 14 March 2024 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story