ఏలూరుజిల్లా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం పోలవరం(Polavaram). ఎన్నికలు సమీసిస్తున వేళ పోలవరం రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆశావహులు ఆసక్తి చూపిస్తుండటంతో అధికార వైసీపీపై ఒత్తిడి మొదలైంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం బాలరాజుకు(Tellam Balaraju) ఈసారి టిక్కెట్ ఇవ్వడం లేదన్న వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అత్యంత కీలకమైన పోలవరం టిక్కెట్..ఎవరికి ఇస్తారా? అనేదానిపై అధికార పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇటీవల వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jagan)..నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపారు. సర్వేల్లో సానుకూలత లేని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. కాదు..అనారోగ్య కారణాలతో ఆయనే తప్పుకుంటున్నట్టు చెప్పారనేది మరో ప్రచారమూ ఉంది. ఎలాగో ఈ విషయం బయటకు పొక్కింది. అంతేకాదు..ఈసారి కొత్తముఖాలకే అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పటి నుంచో ఈ సీటుపై కన్నేసిన ఆశావహులు.. టికెట్(Ticket) కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి టిక్కెట్ అడుగుతున్న వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే. అయితే నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన తెల్లం బాలరాజు కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడం ఆసక్తికర అంశం.

పోలవరం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నవారిలో ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ ఈపీడీసీఎల్ 327 యూనియన్ జిల్లా కార్యదర్శి బొరగం దుర్గా ప్రసాద్(Durga Prasad) ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. అలాగే ఎంపీపీ కారం రమణాశాంతకుమారి, అటవీశాఖ ఉద్యోగి తెల్లం సూర్య చంద్రరావు పోటీలో ఉన్నారట. ఆశావహులంతా ఎవరికి వారే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారట. దీంతో అభ్యర్థి విషయంలో అధిష్టానం త్వరగా ఓ నిర్ణయానికి రావాలని పార్టీ శ్రేనులు కోరుతున్నాయి. మరి..వై నాట్ 175 లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ(YSRCP) అధినేత, సీఎం జగన్..పోలవరం టికెట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇక టీడీపీలో(TDP) పోలవరం టిక్కెట్ కోసం బొరగం శ్రీనివాసరావు, మోడియం శ్రీనివాసరావు మధ్య పోరు నడుస్తోంది. వీరిలో ఎవరికి సీటిచ్చినా కచ్చితంగా అసంతృప్తిని ఎదుర్కోక తప్పదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే చంద్రబాబు(Chandrababu) ఎవరికి అవకాశం కల్పిస్తారో తేలాల్సి ఉంది. ఏపీలో ఉన్న ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో అధికార వైసీపీకి మంచి పట్టుంది. రాష్ట్రంలో మొత్తం ఏడు ఎస్టీ రిజర్వుడు స్థానాలు ఉంటే..ఆరింటిలో వైసీపీ విజయం సాధించగా..టీడీపీ ఒక్కసీటు మాత్రమే గెలుచుకుంది. ఈసారి టీడీపీ-జనసేన(Janasena) కలిసి పోటీ చేస్తుండటంతో ఈ ఏడు నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారనుంది.

Updated On 23 Dec 2023 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story