YCP Chevi Reddy Bhaskar Reddy : వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు!
మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై(Chevi reddy Bhaskar Reddy) పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది
మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై(Chevi reddy Bhaskar Reddy) పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఆ మధ్యన చంద్రగిరి(chandragiri) నియోజకవర్గ పరిధిలో ఉన్న యర్రవారిపాలెం(Yarravari palem) మండలంలో ఓ దళిత బాలికపై(Dalit Girl) అత్యాచారం(Rape) జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే తమ కూతురుపై అత్యాచారం జరిగినట్టు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా చెవిరెడ్డితో పాటు మరికొందరిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సమాచారం. అయితే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో(Balineni srinivas reddy) మీడియా కేంద్రంగా చెవిరెడ్డి వాదన చేస్తున్న సమయంలో కేసు నమోదు కావడం గమనార్హం. దాంతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై ఎలాగైనా కేసులు పెట్టాలని అనుకుంటున్నారని వినికిడి. ఇప్పుడు ఈ కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు కేసులకు తాను భయపడేది లేదంటూ చెవిరెడ్డి సోమవారం మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే!
పాకిస్తాన్‌లో హై టెన్షన్... ఉద్రిక్తంగా మారిన పీటీఐ ఆందోళనలు!
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలనే డిమాండ్‌తో పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసనలతో దేశం అట్టుడుకుతోంది. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఖైబర్ పఖ్తుంఖా ముఖ్యమంత్రి అలీ అమీన్ నేతృత్వం వహించిన ఈ కవాతు సోమవారం సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకుంది. ఇస్లామాబాద్‌కు మరెవ్వరూ రాకుండా ప్రభుత్వం మొత్తం బారీకేడ్లు ఏర్పాటు చేసింది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రహదారులను మూసి వేశారు. నగరం మొత్తం లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. అయినా ప్రజలు వెరువలేదు. ముందుకే సాగారు. అవరోధాలను తొలగించుకుంటూ వస్తున్న నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సమయంలో పోలీసులపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఈ ఘటనలో అయిదుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. నిరసనలు, ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇమ్రాన్‌ఖాన్ ఏడాది కాలంగా రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.