ఎన్డీయే కూటమి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఎన్డీయే కూటమి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేశారు. పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదని... సునామీ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తమకు అతిపెద్ద బహుమతి ఇచ్చారన్నారు. ఏపీలో మనం చారిత్రక విజయం సాధించామని చంద్రబాబు తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఓ సునామీ అని.. అలాంటి పవన్ ఇప్పుడు మన సమక్షంలోనే ఉన్నారని ఎన్డీయే కూటమి సమావేశంలో తెలిపారు.

పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో మోదీని నాయకుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు, టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జన శక్తి (పాశ్వాన్), ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా మిత్రపక్షాల ఎంపీలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీశ్ కుమార్, ఏక్‌నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. తనను ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం మోదీ మాట్లాడారు.

Updated On 7 Jun 2024 3:45 AM GMT
Yagnik

Yagnik

Next Story