ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్‌పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్‌ కనుబొమ్మకు తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగింది.

సీఎం జగన్ పై జరిగిన దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌పై పోస్ట్‌ చేశారు. ఏపీ సీఎం జగన్ పై రాయి దాడిని ఖండించారు తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. రాజకీయాల్లో బేధాభిప్రాయాలుంటాయని.. అయితే, హింసకు తావులేదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవాలని.. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని స్టాలిన్ ఆకాంక్షించారు.

Updated On 13 April 2024 7:20 PM GMT
Yagnik

Yagnik

Next Story