Modi About Ramoji Rao: రామోజీరావు మరణంపై స్పందించిన ప్రధాని మోదీ
ప్రముఖ మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు
ప్రముఖ మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూశారు. 88 సంవత్సరాల వయసులో రామోజీరావు తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతూ ఉన్నారు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన శ్వాస తీసుకోడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం తెల్లవారుజామున 4:50 కు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని.. పాత్రికేయ, సినీరంగంపై ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని చెప్పారు. ఆయనతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు.