Pithapuram Queen : పెళ్లి తర్వాత పిఠాపురం రాణి మరో ప్రేమవివాహం
కపిలేశ్వరపురం, నూజివీడు జమీందారు రాజారావు వెంకట కుమార మహిపతి సూర్య రావు బహదూర్, రాణి చిన్నమాంబ దేవి మూడో కూతురుగా 1917 మే 2న సీతాదేవి జన్మించారు. 1935లో ఉయ్యూరు జమీందార్ మేకా రంగయ్య అప్పారావు బహదూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి రాజా ఎం. విదుత్ కుమార్ అప్పారావు అనే కుమారుడు ఉన్నాడు. ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవీ గుర్రపు పందేలకు హాజరయ్యేవారు. ఆమె హైదరాబాదు 7వ నిజాం కోడలు, యువరాణి నీలోఫర్‌కి సన్నిహిత స్నేహితురాలు.
కపిలేశ్వరపురం, నూజివీడు జమీందారు రాజారావు వెంకట కుమార మహిపతి సూర్య రావు బహదూర్, రాణి చిన్నమాంబ దేవి మూడో కూతురుగా 1917 మే 2న సీతాదేవి జన్మించారు. 1935లో ఉయ్యూరు జమీందార్ మేకా రంగయ్య అప్పారావు బహదూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి రాజా ఎం. విదుత్ కుమార్ అప్పారావు అనే కుమారుడు ఉన్నాడు. ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవీ గుర్రపు పందేలకు హాజరయ్యేవారు. ఆమె హైదరాబాదు 7వ నిజాం కోడలు, యువరాణి నీలోఫర్‌కి సన్నిహిత స్నేహితురాలు.
బరోడాకు చెందిన మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్(Prathap singh gaikwad) ఆనాటికి దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతుండేవారు. ఆయనకు గుర్రపు పందేల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. అలా మద్రాసులో అడుగుపెట్టిన ప్రతాప్ సింగ్ గుర్రపు పందేల క్లబ్బు వద్ద రాణి సీతాదేవిని(Queen sithadevi) చూశారు. తొలిచూపులోనే ఆమె అందానికి మైమరిచిపోయారు. "సీతాదేవి చాలా అందంగా ఉంటారు, ఆమె అందానికి మహారాజు మైమరిచిపోయారు. సీతాదేవి కూడా మహారాజు ప్రతాప్ సింగ్ వ్యక్తిత్వానికి ఆకర్షితులై ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డువచ్చాయి. దీంతో ప్రేమికులు న్యాయ బృందంతో సంప్రదింపులు జరిపారు. భారతీయ చట్టం ప్రకారం జమీందార్‌తో వివాహాన్ని రద్దు చేసుకోవడానికి హిందూ మతానికి సీతా దేవి ఇస్లాంలోకి మారాలని న్యాయవాదులు సూచించారు. ఆమె మతం మారిన తర్వాత, గైక్వాడ్ ఆమెను 1943లో తన రెండో భార్యగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ హిందూ మతంలో కలిశారు.
ఆ వివాహంపై అప్పట్లో బ్రిటీష్ వైస్రాయ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్న తర్వాత ఆమెకు రెండో వివాహానికి అడ్డంకులుండవని, రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు. అయితే అప్పట్లో సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆమెను రాజ్యంలోని మహారాణులను పిలిచే ‘హర్ హైనెస్’ గా సంబోధించకూడదని నిర్ణయించారు.
అయితే సీతాదేవి రాకతో ప్రతాప్‌సింహారావు కుటుంబంలో గందరగోళం నెలకొంది. ప్రతాప్‌సింహారావు మొదటి భార్య శాంతాదేవితో సీతాదేవికి పొసగలేదని చేప్తారు. ఈ క్రమంలోనే 1945లో వారికి వారసుడు శాయాజీరావు గైక్వాడ్ జన్మించారు. అదే సంవత్సరంలో ఆమె మొనాకోలోని మాంటీకార్లోకి వలస వెళ్లారు. అప్పటికే మాంటీకార్లో నగరం విలాసవంతమైన జీవితాలకు, కాసినో సహా అనేక జూద క్రీడలకు కేంద్రంగా ఉండేది. గైక్వాడ్ తరుచుగా మొనాకోకు వచ్చి బరోడా నుంచి కొంత సంపద తరలించేవారు. మహారాణి ఈ సంపదలకు సంరక్షకురాలిగా వ్యవహరించేవారు.
ఇక దేశానికి స్వాతంత్య్రం రావడం, సంస్థానాలను భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో ఆమె అక్కడే స్థిరపడ్డారు.
మాంటీకార్లోకు తరలించిన ఆభరణాల్లో 4 ముత్యాల తివాచీలు, ప్రసిద్ధ బరోడా ముత్యాలతో తయారు చేసిన 7-తీగల నెక్లెస్, విలువైన వజ్రాలున్నాయి.
రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించిన ఆ జంట రెండుసార్లు అమెరికా కూడా వెళ్లారు. ఆ సమయంలో పెద్దమొత్తంలో ఖర్చు చేసినట్టు చెప్తారు. తమ విలాసమైన జీవన ఖర్చుల కోసం బరోడా సంస్థాన భాండాగారం నుంచి రుణం కూడా తీసుకున్నట్లు చెబుతారు.
బరోడా సంస్థానం నుంచి తీసుకున్న అప్పులకుగానూ భారతదేశంలో విలీనం తర్వాత కేంద్ర ప్రభుత్వం చెల్లించిన రాజాభరణం నుంచి 8 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే నేటి కరెన్సీలో సుమారు రూ. 6.5 కోట్లు మినహాయించుకున్నట్టు చెబుతారు.
మొనాకోలో స్థిరపడి, అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌ను 1951లో భారత ప్రభుత్వం సంస్థానాధిపతి హోదాను తొలగించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు ఆయన మొదటి భార్య సంతానానికి దక్కుతాయంటూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ప్రతాప్ సింగ్ తిరిగి ఇండియాకు రావడానికి సిద్ధపడటంతో రాణి సీతాదేవితో విభేదాలు వచ్చాయి. చివరకు 1956లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్‌తో సీతాదేవి విడాకులు తీసుకున్నారు. భారత ప్రభుత్వానికి దక్కాల్సిన విలువైన వజ్రాలు, ఆభరణాలను ఆమె మొనాకోకు తరలించడం వల్ల ఆమె ఇండియాకు రావడంపై మీద ఆంక్షలు పెట్టారు. శాయాజీరావు గైక్వాడ్ మాత్రం తల్లితోనే ఉన్నారు. 1985లో కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో బాగా కుంగిపోయారు సీతాదేవి. 1989 ఫిబ్రవరి 15న ఆమె మరణించారు.
దేశంలోనే అత్యంత విలాసవంతమైన జీవనం గడిపిన మహారాణిగా ఆమెను చరిత్రకారులు పేర్కొన్నారు. అత్యంత సౌందర్యవతి అని కూడా కీర్తించారు. "వారికి అప్పట్లోనే సొంతంగా ఎయిర్ జెట్ ఉండేది. విలువైన సంపదకు వారసురాలు కావడంతో ఖర్చులకు వెనుకాడలేదు. వివిధ దేశాల్లో పందేలకు వెళ్లేవారు. చివరకు ఆమె భారతదేశం వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో బంధువులను కలిసేందుకు కొలంబో వెళ్లేవారు. ఆ తర్వాత లండన్ వెళ్లిపోయేవారు. ఆమె మరణించిన తర్వాత తన ఆస్తిని అక్క కూతురు అనంగ రేఖాదేవికి అప్పగించారు. ఇంతటి విలాసజీవితం గడిపిన వ్యక్తులు బహుశా దేశ చరిత్రలో మరొకరు ఉండరని పరిశోధకులు చెప్తున్నారు.