Pithapuram MLA : పుట్టినరోజు నాడు ఆ ఎమ్మెల్యే వైసీపీకి షాక్ ఇస్తారా..?
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది.

Pithapuram MLA Pendem Dorababu plans to resign from YCP
పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు(Pithapuram MLA Dorababu) వైసీపీ(YCP)కి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో దొరబాబు త్వరలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే నేడు పెండెం దొరబాబు పుట్టినరోజు కావడం విశేషం. ఈ క్రమంలోనే పుట్టినరోజు వేడుకల(Birth Day Celebrations) పేరుతో అనుచరులతో దొరబాబు భారీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వేడుకల కోసం ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు(Flexis), జన్మదిన శుభాకాంక్షల కటౌట్‌లలో ఎక్కడా వైసీపీ జెండా కానీ.. జగన్ ఫోటో కానీ లేకుండా సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. ఈ రోజు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తారా అనే దానిపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. దొరబాబుకు ఎమ్మెల్యే టికెటును నిరాకరించి ఆ స్థానంలో ఇన్‌చార్జిగా కాకినాడ ఎంపీ గీత(Kakinada MP Geetha)ను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దొరబాబు రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. నేటి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా దొరబాబు.. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు భారీగా విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
