Pithapuram : పిఠాపురం దొరబాబుకు చెక్..తెరపైకి ఎంపీ వంగ గీత !
రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ(YSRCP) సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు కొనసాగుతోంది. ప్రజల్లో సానుకూలత లేకపోయినా, సర్వేల్లో వ్యతిరేక ఫలితం వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్(CM Jagan). ఉభయ గోదావరిజిల్లాల్లోనూ మార్పులు చేర్పులు చేపట్టిన జగన్.. పిఠాపురం(Pithapuram) సిట్టింగ్‌కు నో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పిఠాపురంలో పెండెం దొరబాబు(Pendem Dorababu) సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయనను పక్కనపెట్టి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతకు అవకాశమిస్తున్నారని సమాచారం.

ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో(East Godavari) కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. అయితే జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో పిఠాపురం, అమలాపురం(Amalapuram), రాజోలు(Razole) కనిపిస్తున్నాయి. పిఠాపురం మినహా అమలాపురం, రాజోలు రెండూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలే. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) రెండు చోట్ల పోటీ చేసినా ప్రతికూల ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి పిఠాపురంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వేల్లోనూ జనసేనకు సానుకూలంగా ఉన్న సెగ్మెంట్ ఇది. పొత్తులో భాగంగా జనసేనకు(Janasena) ఈసీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అందు కోసమే సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును తప్పించి, బలమైన అభ్యర్థి వంగా గీతను(Vanga geetha) తెరపైకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ వంగ గీత కూడా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరడతో..సీఎం జగన్ టికెట్ కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2009లో..ఆమె ప్రజారాజ్యం(Prajarajyam) తరఫున ఇక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడమేగాకుండా.. నియోజకవర్గ ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉంది.
కాకినాడ(Kakinada) జిల్లాలోనే పిఠాపురం ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది కాపు (Kapu)సామాజికవర్గం ఓటర్లే. అయితే గడిచిన 4 దశాబ్దాల్లో ఏ ఒక్క నాయకుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాల్లేవు. లీడర్లను ఎన్నుకోవడంలో పిఠాపురం ఓటర్లు..ప్రతిసారి రాజకీయ వైవిధ్యం చూపుతున్నారు. ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయడం నాయకులకు, పార్టీలకు బిగ్ టాస్క్ అనే చెప్పాలి. మరి.. అలాంటి పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి మార్పుతో తన పట్టు నిలుపుకుంటుందా? అధికార వైసీపీకి షాకిచ్చేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయా? జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేస్తే రాజకీయ లెక్కలు మారిపోతాయా? అనేదానిపై పిఠాపురం నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ అప్పుడే మొదలైంది.