ఎంబీబీఎస్(MBBS) సీట్ల భర్తీలో రిజర్వేషన్లను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 107, 108, 111 జీవోలపై ప‌శ్చిమ‌గోదావ‌రికి చెందిన‌ ప్రత్తిపాటి ప్రేమ్ సాజన్ స‌హా ప‌లువురు విద్యార్థులు హైకోర్టులో(High Court) పిటిష‌న్ వేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోల వలన ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనార్టీ విద్యార్థులందరికీ రిజర్వేషన్ల(Reservations) విషయంలో తీరని అన్యాయం జరుగుతుందని వారు పిటిషన్ లో పేర్కొన్నారు.

ఎంబీబీఎస్(MBBS) సీట్ల భర్తీలో రిజర్వేషన్లను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 107, 108, 111 జీవోలపై ప‌శ్చిమ‌గోదావ‌రికి చెందిన‌ ప్రత్తిపాటి ప్రేమ్ సాజన్ స‌హా ప‌లువురు విద్యార్థులు హైకోర్టులో(High Court) పిటిష‌న్ వేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోల వలన ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనార్టీ విద్యార్థులందరికీ రిజర్వేషన్ల(Reservations) విషయంలో తీరని అన్యాయం జరుగుతుందని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషనర్ల తరఫున కోర్టులో వాదనలు వినిపించారు.

రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని.. ఈ జీవోల వలన వేలాదిమంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్ల విషయంలో నష్టపోతున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చట్టాలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా రిజర్వేషన్లు ఇవ్వలేదని వాదించారు. ఈ జీవోల వలన కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకే కాక మెరిట్ లో ఉన్న ఓపెన్ క్యాటగిరి విద్యార్థులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రిజర్వేషన్ లో ఉన్న సీట్లను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది అంటూ.. దీనివలన వందలాది మంది విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారంటూ వాదనలు వినిపించారు.

వాద‌న‌లు విన్న‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్, శేష సాయిలతో కూడిన‌ ధర్మాసనం.. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది. ఈ జీవోలకు అనుగుణంగా ఏ అడ్మిషన్ ప్రక్రియ జరిగినా.. అది తుది తీర్పుకు లోబడి ఉంటుందంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Updated On 10 Aug 2023 2:12 AM GMT
Ehatv

Ehatv

Next Story