ఓ విద్యార్థినికి ఓ పీఈటీ అసభ్యకరంగా మెసేజ్ చేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఓ విద్యార్థినికి ఓ పీఈటీ అసభ్యకరంగా మెసేజ్ చేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నందిగాం మండలంలోని హరిదాసుపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడు గత నెల 31రాత్రి ఓ విద్యార్థినితో అసభ్యంగా చాటింగ్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్య వహారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హరిదాసుపురం డ్రిల్‌ మాస్టారు డిసెంబరు 31 అర్ధరాత్రి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఫోన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు. ఆ తర్వాత అసభ్యంగా చాటింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. బాలిక కుటుంబసభ్యులు చాటింగ్‌ చూసి, తర్వాత రోజు స్కూల్‌కు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు, కొంతమంది గ్రామస్తుల సమక్షంలో డ్రిల్‌ మాస్టర్‌ను నిలదీశారు. నందిగాం పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో కొందరు స్థానిక లీడర్లు బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story