వారాహి యాత్ర‌లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో బుధ‌వారం జ‌రిగిన‌ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన‌ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సంద‌ర్భంగా పవన్ కల్యాణ్ పై పేర్నినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పులు చూపించారు. ఒక చెప్పు చూపించి పవన్ పెద్ద మొగోడినని అనుకుంటున్నాడు.. నేను రెండు చెప్పులు చూపిస్తున్నాను.. పవన్ కంటే తాను పెద్ద మొగోడినన్నారు.

వారాహి యాత్ర‌లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో బుధ‌వారం జ‌రిగిన‌ బహిరంగ సభలో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన‌ వ్యాఖ్యలపై వైసీపీ (YCP) ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సంద‌ర్భంగా పవన్ కల్యాణ్ పై పేర్నినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పులు చూపించారు. ఒక చెప్పు చూపించి పవన్ పెద్ద మొగోడినని అనుకుంటున్నాడు.. నేను రెండు చెప్పులు చూపిస్తున్నాను.. పవన్ కంటే తాను పెద్ద మొగోడినన్నారు. పదేళ్లుగా జ‌న‌సేన‌ పార్టీని నడుపుతున్నది చంద్రబాబేనని.. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని.. నారాహి యాత్ర అని సెటైర్లు సంధించారు. ప్రభుత్వం తప్పు చేస్తే వదలనని చెప్పిన పవన్.. 2014- 2019 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కరోజయినా నిలదీశాడా? అంటూ ప్రశ్నించారు. ఏనాడైనా చంద్రబాబు చొక్కా పట్టుకున్నాడా? అంటూ ధ్వజమెత్తారు.

కత్తిపూడి సభలో పవన్ కల్యాణ్ చేసిన ప్ర‌తీ వ్యాఖ్య అబద్ధమేనన్నారు. అధికార పార్టీ తన సినిమాలను అడ్డుకుంటోందంటూ పవన్ చేసిన ఆరోపణలో అర్థం లేదని అన్నారు. తాము అడ్డుకున్న ఒక్క సినిమా అయిన చూపించగలవా? అంటూ సవాల్ విసిరారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ నటించిన సినిమాలు రెండు విడుదల అయ్యాయి. ఆ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. వాటిని తాము అడ్డుకున్నామా? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబుతో సావాసం చేయడం ద్వారా పవన్ దిగజారిపోయాడని.. అబద్ధాలను ప్రచారం చేస్తే మక్కెలిరిగిపోతాయంటూ హెచ్చరించారు. ప్రజలను నమ్ముకుంటే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతావు.. వ్యూహాలను నమ్ముకుంటే అసెంబ్లీ గేటు దాకా వెళ్లలేవని.. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌రిచ్చారు. టీడీపీనీ జీవితంలో ఎప్పటికీ క్షమించనంటూ ప్రతిజ్ఞ చేసిన పవన్.. ఇప్పుడు ఆ పార్టీ నాయకుల పంచన చేరాడని వీడియో చూపిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Updated On 15 Jun 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story