1977 నుంచి చంద్రబాబు(Chandrababu) ఎన్నో స్కాంలు, ఎంతో అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి పేర్నినాని(Perni Nani) విమర్శించారు. బాబు తన కుయుక్తులు, నక్కజిత్తులతో వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ 45 ఏళ్లుగా చక్రం తిప్పాడని మండిపడ్డారు. ఈ కాలంలో ఎన్నో స్కాంలు చేస్తూ చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకూంటూ మేనేజ్‌ చేశాడని దుయ్యబట్టారు.

1977 నుంచి చంద్రబాబు(Chandrababu) ఎన్నో స్కాంలు, ఎంతో అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి పేర్నినాని(Perni Nani) విమర్శించారు. బాబు తన కుయుక్తులు, నక్కజిత్తులతో వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ 45 ఏళ్లుగా చక్రం తిప్పాడని మండిపడ్డారు. ఈ కాలంలో ఎన్నో స్కాంలు చేస్తూ చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకూంటూ మేనేజ్‌ చేశాడని దుయ్యబట్టారు. పాపం ఎల్లకాలం నిలబడదని, అన్ని రోజులూ న్యాయస్థానాన్ని ఏమార్చలేరని పేర్కొన్నారు. ఇన్నాళ్లకు న్యాయం, ధర్మం గెలిచిందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.

ఇంకా చాలా స్కామ్‌లు బయటకు వస్తాయ్‌ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు ఎంత గడ్డి కరిచేందుకైనా దిగజారతారని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు పాపం ఇన్నేళ్లకు పండిందని, ఇది కేవలం తీగ మాత్రమే..ఇంకా చాలా స్కామ్‌లు బయటకు వస్తాయని అన్నారు. పవన్‌, పురంధేశ్వరి చంద్రబాబును కాపాడటం కోసమే పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అరెస్ట్‌ చేస్తుందనే సమాచారం చంద్రబాబుకు ఉందని చెప్పారు.

చట్ట ప్రకారమే చంద్రబాబు అరెస్ట్‌ : ‘చంద్రబాబు పాపాల భైరవుడు. యువతకు నైపుణ్యం పేరుతో కోట్లాది రుపాయలు దోచుకున్నారు. చట్ట ప్రకారమే చంద్రబాబును అరెస్ట్‌ చేశారు. సీఐడీ అధికారులు చట్ట ప్రకారమే వ్యవహరించారు. దర్యాప్తు జరిగే కొద్దీ అన్నీ పేర్లు బయటకొస్తుంటాయి. హెలికాప్టర్‌లో తీసుకెళతామంటే వద్దన్నారు. రోడ్డు మార్గంలో వెళితే హడావుడి చేయొచ్చనుకున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Updated On 11 Sep 2023 2:49 AM GMT
Ehatv

Ehatv

Next Story