Perni Nani Pawan Kalyan: పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే ఆ పాత్ర ఒక్కటే
పవన్ ఆయన గురించి ఆయనే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు పేర్ని నాని
టీడీపీ, జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణే చేశారని.. వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని అన్నారు. ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్‌కు పట్టదన్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేరన్నారు. పవన్ సినిమా డైలాగ్‌లు బట్టీ కొట్టారు. సినిమా వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదివారు. నాడు అమరావతి.. ఒక కులానికే రాజధాని అని పవన్ అన్నారు. అమరావతి అందరికీ రాజధాని కాదు.. అది కొందరి రాజధానే అని పవన్ గతంలో ఎందుకన్నారు. ఆరోజుకు.. ఈరోజుకు.. అమరావతి విషయంలో ఏం మార్పు జరిగిందో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కు చేతనైంది చేసుకోవచ్చు. నువ్వు 24 కాకపోతే.. నాలుగో, రెండో.. ఎన్ని సీట్లు తీసుకుంటే మాకెందుకు బాధ. వైఎస్సార్‌సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్.. జగన్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు మూడో జెండా కోసం ఎదురుచూస్తున్నారన్నారు. నీ చేష్టల వల్ల పవన్‌కు ఓటేద్దామనుకున్న కాపులు బాధపడతారు.
పవన్ ఆయన గురించి ఆయనే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు పేర్ని నాని. పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉంది. పవన్ వామనుడు కాదు శల్యుడు, శికండిలాంటివాడు. పార్టీని, పార్టీ నేతల్ని అందరినీ శల్యుడిలా పవన్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. నన్ను జైలులో పెడితే.. పవన్ వచ్చి మా పార్టీని బతికించారని చంద్రబాబు అన్నారా?. పవన్ సభలో అన్నీ సొల్లు కబుర్లే. పవన్ తనను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతున్నారన్నారు. హు కిల్డ్ ఎన్టీఆర్.. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్ పని. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం ఎంత కష్టమో.. పవన్‌ను నమ్ముకుని రాజకీయం చేయడం కూడా అంతేనన్నారు.