పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఐదు రోజులు కృష్ణా జిల్లా ఆటవిడుపు యాత్ర చేశాడ‌ని.. పవన్ మాటలు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని(Perni Nani) ఫైర్ అయ్యారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఐదు రోజులు కృష్ణా జిల్లా(Krishna District) ఆటవిడుపు యాత్ర చేశాడ‌ని.. పవన్ మాటలు జనసేన(Janasena) పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పవన్ లా రోజుకో పార్టీ మార్చరని అన్నారు. జగన్(YS Jagan) కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తారని అన్నారు. వైఎస్ఆర్(YS Rajashekar reddy) పై నువ్వు ఎప్పుడు పోరాటం చేసావు పవన్ ? అని ప్ర‌శ్నించారు. సీఎం జగన్ గురించి అవాకులు చెవాకులు మాట్లాడితే సహించమ‌ని హెచ్చ‌రించారు. బీజేపీ(BJP) కంటే చంద్రబాబే(Chandrababu( తనకు ముఖ్యమని పవన్ తేల్చేశారని అన్నారు. కొల్లేరు(Kolleru)పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని.. పవన్ వస్తే నేను దగ్గరుండి తీసుకెళతాన‌న్నారు. ఎవరో రాసిస్తే.. అది చదవడం మానేయ్ పవన్ అని అన్నారు. అస‌లు ఏపీలో పవన్ కు ఆధార్(Adhaar Card) కార్డుందా.? ఇల్లుందా.? అని ప్ర‌శ్నించారు. అవనిగడ్డ(Avanigadda)లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చినట్టు చెప్పావు.. ముదినేపల్లి(Mudinepalli)లో మళ్లీ ఎన్డీఏ(NDA)లోనే ఉన్నానని చెబుతున్నావు అని సైటైర్లు సంధించారు.

Updated On 6 Oct 2023 8:16 PM GMT
Yagnik

Yagnik

Next Story