ఇప్పుడు జనసేన పార్టీ మళ్లీ భారతీయ జనతా పార్టీ కూటమిలోకి చేరింది. అలాగే తెలుగుదేశం పార్టీని కూడా పవన్ కళ్యాణ్ ఎన్.డి.ఏ. లో చేర్చడానికి చాలా కష్టాలే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీని విమర్శించినప్పుడు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? అదే పాచిపోయిన లడ్డూలు డైలాగ్. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. కేవలం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. ఆ డైలాగ్ సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయింది.

ఇప్పుడు జనసేన పార్టీ మళ్లీ భారతీయ జనతా పార్టీ కూటమిలోకి చేరింది. అలాగే తెలుగుదేశం పార్టీని కూడా పవన్ కళ్యాణ్ ఎన్.డి.ఏ. లో చేర్చడానికి చాలా కష్టాలే పడ్డానని చెబుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో పవన్ కళ్యాణ్ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రజాగళం సభపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. విభజన హామీల నేపథ్యంలో, కేంద్రం ఏమిచ్చిందని.. పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని గుర్తు చేశారు. 2014లో తిరుపతి బాలాజీ సాక్షిగా మా కలయిక జరిగింది అని పవన్ చెప్పారు. మరి 2019లో ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు 2024లో తాజా లడ్డూలుగా మారిపోయాయా అని ప్రశ్నించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ కాకినాడలో పాచిపోయిన లడ్డూల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఐదేళ్లు గడిచేసరికి ఆ లడ్డూలు చిలకలూరిపేట సభకు వచ్చేసరికి తాజా లడ్డూలు ఎలా అయ్యాయో రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ చెప్పారా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ లడ్డూలు ఎంత రుచిగా ఉన్నాయి? ఎందుకు రుచిగా ఉన్నాయి? అని ప్రజలకు ఎందుకని చెప్పలేదు?" అని సెటైర్లు వేశారు. ఇక చంద్రబాబు నాయుడు భజన సభలో మామూలుగా లేదని పేర్ని నాని అన్నారు. చంద్రబాబులో ఇంత మార్పునకు కారణం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Updated On 17 March 2024 9:20 PM GMT
Yagnik

Yagnik

Next Story