Perni nani, Perni Kittu : పెడనలో వ్యక్తిపై కత్తులతో దాడి.. బాధితుడిని పరామర్శించిన పేర్ని కిట్టు
కృష్ణా జిల్లా(Krishna) పెడనలో(pedana) ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. కప్పలదొడ్డికి(Kappaladoddi) చెందిన పంతం బలరాంపై యర్రా దేవ, యర్రా జీవన్ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

Perni nani, Perni Kittu
కృష్ణా జిల్లా(Krishna) పెడనలో(pedana) ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. కప్పలదొడ్డికి(Kappaladoddi) చెందిన పంతం బలరాం(Pantham Balaram)పై యర్రా దేవ(Yerra Deva), యర్రా జీవన్(Yerra Jeevan) అనే వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. పంతం బలరాం మార్నింగ్ వాకింగ్(Morning Walk) లో ఉండగా దాడి జరిగింది. రక్తపు మడుగులో ఉన్న బలరామ్ ను స్థానికులు హుటాహుటిన మచిలీపట్నం(Machilipatnam) ప్రభుత్వాస్పత్రికి(Government Hospital) తరలించారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని(Perni nani) తనయుడు పేర్ని కిట్టు(Perni Kittu) మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో బలరాంని పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెడన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
