వైఎస్‌ వివేకాను దాదాపు 20 ఏళ్లపాటు ఒంటరిగా వదిలేసి తన తల్లి సౌభాగ్యమ్మతో

నేషనల్‌ దళిత జేఏసీ అధ్యక్షుడు పెరికె వరప్రసాదరావు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుతో కలిసి వీరు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా షర్మిల, సునీతలు మాట్లాడుతూ ఉన్నారని పెరికె వరప్రసాదరావు అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ వల్ల వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలు పెరిగితే షర్మిల వల్ల ప్రతిష్ట దిగజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన ఖండించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం రుజువు కాని నేరారోపణలను అభ్యర్థిపై చేయకూడదని, అవేమి పట్టించుకోకుండా షర్మిల చేస్తున్న ఆరోపణలు, విమర్శలు సరైనవి కావన్నారు వరప్రసాదరావు.

వైఎస్‌ వివేకాను దాదాపు 20 ఏళ్లపాటు ఒంటరిగా వదిలేసి తన తల్లి సౌభాగ్యమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న నర్రెడ్డి సునీత ఇప్పుడు నీతులు చెబుతున్నారన్నారు. చరిత్ర పుటల్లో వైఎస్సార్‌ పేరు లేకుండా చేయాలని చంద్రబాబు ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నాడని, అటువంటి రేవంత్, చంద్రబాబు పంచన చేరి షర్మిల, అనీల్‌కుమార్, సునీత డ్రామాలు ఆడుతున్నారన్నారు. తన బాబాయి వివేకా చివరి కోరిక మేరకు కడప ఎంపీకి పోటీ చేస్తున్నానని షర్మిల చెబుతోందని, అదే నిజమైతే 2019లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. దస్తగిరికి బెయిల్‌ ఇప్పించడమే కాకుండా అతన్ని సంరక్షిస్తున్న సునీత ఇప్పుడు ఎవరికి అనుకూలంగా పలుకులు పలుకుతుందో జనం గమనిస్తున్నారన్నారు.

Updated On 9 April 2024 9:49 PM GMT
Yagnik

Yagnik

Next Story