Chandrababu : యనమల ఫ్యామిలీలో నలుగురికా...? చంద్రబాబును తిట్టుకుంటున్న సీనియర్లు
తెలుగుదేశంపార్టీలో(TDP) ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధన ఒకటుంది. అయితే ఈ నిబంధన కొందరికి వర్తించదు. చంద్రబాబునాయుడు(chandrababu), ఆయన కుమారుడు లోకేశ్(Lokesh), వియ్యంకుడు బాలకృష్ణలు(Balakrishna) టికెట్లు సంపాదించుకోవచ్చు. ఎవరూ అడగకూడదు. అలాగే ఆ పార్టీలో కూసింత పలుకుబడి, బోల్డంత డబ్బు ఉన్న కుటుంబాలకు ఎన్ని టికెట్లైనా ఇస్తారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishna) కుటుంబమే! వారింట్లో నలుగురికి టికెట్లు వచ్చాయి.
తెలుగుదేశంపార్టీలో(TDP) ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధన ఒకటుంది. అయితే ఈ నిబంధన కొందరికి వర్తించదు. చంద్రబాబునాయుడు(chandrababu), ఆయన కుమారుడు లోకేశ్(Lokesh), వియ్యంకుడు బాలకృష్ణలు(Balakrishna) టికెట్లు సంపాదించుకోవచ్చు. ఎవరూ అడగకూడదు. అలాగే ఆ పార్టీలో కూసింత పలుకుబడి, బోల్డంత డబ్బు ఉన్న కుటుంబాలకు ఎన్ని టికెట్లైనా ఇస్తారు. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishna) కుటుంబమే! వారింట్లో నలుగురికి టికెట్లు వచ్చాయి. అలా ఎలా ఇస్తారని బయటకు ఎవరూ మాట్లాడటం లేదు కానీ లోలోపల తిట్టుకుంటున్నారు. తమ వారసులకు టికెట్లు దక్కించుకోలేకపోయిన నేతల ఆగ్రహం మామూలుగా లేదు. యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవి ఉంది. ఇప్పుడు ఆయన వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌కు వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరు అసెంబ్లీ సీటు ఇచ్చింది టీడీపీ. అలాగే యనమల రామకృష్ణుడు అల్లుడు, అంటే సుధాకర్ యాదవ్ కొడుకు పుట్టా మహేశ్ యాదవ్‌కు ఏలూరు లోక్‌సభ టికెట్ దక్కింది. ఇక యనమల కూతురు దివ్యకు తుని అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చింది తెలుగుదేశంపార్టీ! మాజీ అయ్యన్నపాత్రుడు తన కుమారుడు చింతకాయల విజయ్‌కు అనకాపల్లి లోక్‌సభ సీటును అడిగారు. దానికి చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు అలా ఎలా ఇస్తామంటూ పార్టీ నిబంధనలు చూపించారు. యనమల ఫ్యామిలీ బోల్డంత డబ్బు సంపాదించుకున్నదని, ఆ డబ్బు ఇచ్చి టికెట్లు కొంటున్నదని అయ్యన్నపాత్రుడు తన సన్నిహితుల దగ్గర ఆవేదనను పంచుకుంటున్నారట! ఒక్క అయ్యనపాత్రుడే కాదు ఇలా టికెట్లు సంపాదించుకోలేకపోయిన చాలా మంది చంద్రబాబును తిట్టుకుంటున్నారు. మొన్నీమధ్యనే పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఒకటికి మించి సీట్లు దక్కడం ఏమిటని మండిపడుతున్నారు.