సంక్రాంతి(Sankranthi) పండగ దగ్గర పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకోవడమనేది మనందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో భోగి(Bhogi), మకర సంక్రాంతి, కనుమ(Kanuma) అని మూడు రోజుల పాటు సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకుంటారు. సూర్యుడు (Sun) మకరరాశిలో ప్రవేశించే రోజు కావడంతో మకర సంక్రాంతి పండగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు, కొన్ని చోట్ల ఎడ్ల బండ్ల ఊరేగింపులు, ఎడ్ల బండ్ల పోటీలు, చిన్నారులకు బోడలు పోయడంవంటి కార్యక్రమాలతో పండగను సంతోషంతో చేసుకుంటారు.

అయితే సంక్రాంతి పండగ సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశమేంటంటే 'కోడి పందాలు'. కోడిపందేలు సంక్రాంతి సంబరాల్లో అంతర్భాగం. వందల కోట్లలో కోడి పందాలు జరుగుతుంటాయి. ఈ కోడి పందేలు ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు(Guntur), కృష్ణా(Krishna), ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతాయి. ఈనెల 14, 15, 16 తేదీల్లో భారీ భారీ బరులు వేసి శిక్షణ పొందిన పుంజులను(Rooster) బరిలోకి దించుతారు. వందల కోట్లు ఈ మూడురోజుల్లో చేతులు మారుతాయనడంలో అతిశయోక్తి లేదు.

ఈ సారి పందెం కోళ్లకు వ్యాధులు సోకి బలహీనపడ్డాయి. బరిలోకి దిగే కోళ్లు బలంగా ఉంటేనే వాటిని పందెంరాయుళ్లు కొనుక్కుంటారు. పందెం కోళ్లకు రాణిఖేత్ అనే వైరస్ సోకడంతో అవి బలహీనంగా మారాయి. రాణిఖెత్ వ్యాధి కారణంగా పుంజులు గణనీయంగా ప్రభావితమవుతున్నాయి. ఈ వ్యాధి సోకితే కోళ్లు బరిలో నిలవలేవు. దీంతో కోళ్లు పెంచేవారిలో ఆందోళన నెలకొంది. ఇందుకోసం కోళ్ల పెంపకం దారులు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. కాస్ట్‌లీ కాస్ట్‌లీ ఆహారం పెట్టడం వరకు ఓకే కానీ.. ఇప్పుడు వయగ్రా, షిలాజిత్‌, విటమిన్లతో కూడిన కాక్‌టెయిల్‌ను(Cocktails) కోళ్లకు ఆహారంగా అందిస్తున్నారు. ఇవి తాత్కాలికంగా కోళ్లు ఎదగడానికి దోహదపడొచ్చు కానీ దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు ఎదుర్కొంటారని పశు వైద్యులు హెచ్చరిస్తున్నారు. వయగ్రా(Viagra), షిలాజిత్ కాక్‌టెయిల్‌ను ఆహారంగా తీసుకున్న కోళ్లను తింటే మనుషుల ఆరోగ్యానికి పెద్ద దెబ్బే అని చెప్తున్నారు. దీనిపై కోళ్ల పెంపకందారులు మాట్లాడుతూ.. పందెం కోళ్లకు వ్యాధి సోకడంతో వీటిని కొనుక్కునేందుకు ఎవరూ రావడం లేదని.. కోట్లల్లో నష్టపోతున్నామని.. అందుకే కోళ్లను బలంగా తయారుచేసేందుకు వయగ్రా తరహా ఆహారాన్ని అందిస్తున్నామని చెప్తున్నారు.

Updated On 8 Jan 2024 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story