ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎండలు మండిపోతున్నాయి. పింఛన్‌(Pension) కోసం వెళుతున్న వృద్ధులు నానా అగచాట్లు పడుతున్నారు. కొందరు ఎండలకు తట్టుకోలేక చనిపోతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, పద్మ సరస్సు గిరిజన కాలనీలో గోపాలయ్య అనే వృద్ధులు పెన్షన్ కోసం వెళ్లి కుప్పకూలిపోయాడు.

ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎండలు మండిపోతున్నాయి. పింఛన్‌(Pension) కోసం వెళుతున్న వృద్ధులు నానా అగచాట్లు పడుతున్నారు. కొందరు ఎండలకు తట్టుకోలేక చనిపోతున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, పద్మ సరస్సు గిరిజన కాలనీలో గోపాలయ్య అనే వృద్ధులు పెన్షన్ కోసం వెళ్లి కుప్పకూలిపోయాడు. మామిడితోటకు కాపలా ఉంటూ జీవనం సాగిస్తున్న 70 ఏళ్ల గోపాలయ్య బుధవారం రోజున తనకు రావలసిన పింఛన్‌ డబ్బుల కోసం గ్రామంలోకి వస్తు మార్గం మధ్యలో ఎండకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయాడు. చుట్టుపక్కల సంచారం లేకపోవడం ఎవరూ గుర్తించక ప్రాణాలు విడిచాడు. రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామంలోని పిచ్చిగుంటపల్లెకు చెందిన 80 ఏళ్ల ముద్రగడ సుబ్బన్న కూడా ఇలాగే పెన్షన్‌ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. బ్యాంకు ఎదుటే కుప్పకూలిపోయాడు. స్థానికులు గుర్తించేలోపుగానే చనిపోయాడు. కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. హిందూపూర్‌లోనూ ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకుంది.

Updated On 2 May 2024 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story