No ticket for Jogi Ramesh: పెడన నుంచి జోగి రమేష్ ఔట్..మరో చోట నుంచి ఛాన్స్ !
ఏపీలో మరో మూడో నెలల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థుల మార్పుచేర్పులపై దృష్టి పెట్టింది. సర్వేల ఆధారంగా ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను నియమిస్తోంది. దీంతో ఇన్నాళ్లు టికెట్లు ఖరారు అనుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు షాక్‌ల మీద షాకులిస్తోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటికే పలురువు ఎమ్మెల్యేలు, మంత్రులను మారుస్తూ ప్రయోగానికి తెరలేపారు. ఈ క్రమంలోనే సీఎం జగన్(cm jagan) కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న మంత్రి జోగి రమేష్(minister jogi ramesh)ను పెడన నుంచి తప్పించి.. ఓ మహిళా నేతకు టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎన్నికలు సమీస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో టికెట్ల గొడవ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇటు అధికార వైసీపీ(ycp)..అటు టీడీపీ-జనసేన(tdp-janaSena alliance) కూటమి వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలనే గట్టి సంకల్పంతో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థుల ప్రక్షాళన మొదలుపెట్టారు. అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రకియ హాట్ హాట్ గా మారింది. టికెట్ కేటాయింపు విషయంలో సీఎం జగన్ ఎలాంటి మోహమాటం లేకుండా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. పార్టీలో వ్యతిరేకత, ప్రజల్లో ప్రతికూలత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలనేకాదు..మంత్రులను సైతం మార్చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులకు స్థానం చలనం కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా పెడన నుంచి మంత్రి జోగి రమేష్(minister jogi ramesh)ను తప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయనకు కేబినెట్లో చోటు కల్పించి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి(State Housing Minister)గా కీలక బాధ్యతలు కట్టబెట్టారు సీఎం జగన్. ఈ క్రమంలోనే.. తన టికెట్‌కు ఢోకా లేదని భావించిన జోగి రమేష్ కు అధిష్టానం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పెడన నుంచి కృష్ణా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక(Krishna ZP Chair Person Uppala Harika)ను బరిలోకి దించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పెడనలో క్షేత్ర స్థాయిలో జరిగిన పలు సర్వేల్లో మంత్రి జోగి రమేష్ గ్రాఫ్ బాగోలేదని, ప్రత్యామ్నాయంగా ఉప్పాల హారిక గ్రాఫ్ బాగున్నట్టు నిర్ధారణ అయ్యింది. అంతేకాదు..పెడనలో ఉప్పాల హారికకు గట్టి పట్టు ఉంది. అన్ని వర్గాల ప్రజల్లో ఆమెకు మద్దతు ఉండటంతో..ఆమెకు టికెట్ ఇచ్చే విషయంపై అధిష్టానం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో మైలవరం నుంచి జోగి రమేష్ ను తప్పిస్తే..ఆయనను బీసీ కార్డుపై విజయవాడ లేదా ఏలూరు ఎంపీగా బరిలో నిలపాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదీ కుదరకపోతే.. జోగి రమేష్‌ను మైలవరం నుంచి పోటీ చేయించే ఆలోచన కూడా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గం మైలవరం(mylavaram) నుంచి పోటీ చేయిస్తే గెలుపొందే అవకాశాలు ఉన్నాయని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(Mylavaram sitting MLA Vasantha Krishna Prasad) వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన నేపథ్యంలో జోగి రమేష్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.