మాజీమంత్రి(Ex-Minister), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి(Raghuveera Reddy).. ఉమ్మ‌డి ఏపీలో ఓ వెలుగు వెలిగిన నాయ‌కుడు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చాలా కాలం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమిత‌మైన ర‌ఘువీరా.. కొద్ది రోజుల క్రిత‌మే రాజ‌కీయంగా యాక్టివ్ అయ్యారు.

మాజీమంత్రి(Ex-Minister), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ పీసీసీ(PCC) అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి(Raghuveera Reddy).. ఉమ్మ‌డి ఏపీలో ఓ వెలుగు వెలిగిన నాయ‌కుడు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చాలా కాలం రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. పూర్తిగా ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమిత‌మైన ర‌ఘువీరా.. కొద్ది రోజుల క్రిత‌మే రాజ‌కీయంగా యాక్టివ్ అయ్యారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.. ప్ర‌చార బాధ్య‌త‌లను అప్ప‌గించ‌డంతో మ‌ళ్ళీ రాజ‌కీయ వేదిక‌పై మెరిశారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో అడ‌పాద‌డ‌పా రాజ‌కీయ‌ల‌కు సంబంధించి పోస్టులు పెడుతున్నారు.

తాజాగా కాంగ్రెస్(Congress) నాయ‌కుడు రాహుల్ గాంధీకి(Rahul gandhi) ర‌ఘువీరా సోష‌ల్ మీడియా(social Media) వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ పోస్టులో ర‌ఘువీరా.. శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, ప్రత్యేక కేటగిరీ హోదా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి.. హామీలు అమ‌లు చేయ‌గ‌ల‌ ఏకైక హోప్ మీరేనంటూ రాసుకొచ్చారు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ విజ‌యం అనంత‌రం కూడా ర‌ఘువీరా రెడ్డి.. ఆనాడు ఇందిరా గాంధీని(Indra gandhi) ఇబ్బందికి గురిచేసినప్పుడు కన్నడ ప్రజలు అండగా నిలబడ్డారు. ఇప్పుడు రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురిచేస్తున్నప్పుడు కన్నడనాడు మేమున్నామని
ముందుకు వచ్చి నిలబడినందుకు శతకోటి ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టారు. అది బాగా వైర‌ల్ అయ్యింది.

Updated On 18 Jun 2023 11:47 PM GMT
Ehatv

Ehatv

Next Story