NDA Meeting : 18న ఎన్డీయే సమావేశానికి హాజరుకానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జులై 18న ఢిల్లీలో జరగనున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ శనివారం వెల్లడించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం, బీహార్, ఉత్తరప్రదేశ్‌ల నుండి పలు చిన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల నుండి కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సమావేశానికి కొత్త మిత్రపక్షాలుగా హాజరుకానున్నాయి.

Pawan to attend NDA meet in Delhi
జులై 18న ఢిల్లీలో జరగనున్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (National Democratic Alliance) సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పాల్గొంటారని జనసేన పార్టీ(Janasena Party) శనివారం వెల్లడించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) నేతృత్వంలోని శివసేన(Shivsena), అజిత్ పవార్(Ajit Pawar) నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం, బీహార్, ఉత్తరప్రదేశ్‌ల నుండి పలు చిన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల నుండి కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సమావేశానికి కొత్త మిత్రపక్షాలుగా హాజరుకానున్నాయి.
లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ అధికార కూటమి బలాన్ని ప్రదర్శించే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన(Uddav Thackrey Shivsena), శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (యునైటెడ్)తో సహా అనేక పాత, కీలకమైన బీజేపీ మిత్రపక్షాలు బంధాలను తెంచుకున్న నేపథ్యంలో.. ఎన్‌డీఏ ఈ స్థాయి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిది.
ఎన్‌డీఏ సమావేశానికి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan)ను భారతీయ జనతా పార్టీ ఆహ్వానించింది. 'ఎన్‌డీఏలో ముఖ్యమైన భాగం' అని ఎల్‌జేపీ(LJP)ని సంబోధిస్తూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా(JP Nadda) పాశ్వాన్‌కు లేఖ రాశారు. జూలై 17న బెంగళూరులో ప్రతిపక్షాల రెండో సమావేశం జరుగనున్న నేపథ్యంలో బీజేపీ ఈ ఆహ్వానం పంపడం గమనార్హం. ఈ సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఎన్‌డీఏ ముఖ్యమైన భాగస్వామిగా మీ పాత్ర, మీ సహకారం కూటమిని బలోపేతం చేయడమే కాకుండా దేశ అభివృద్ధి ప్రయాణాన్ని బలపరుస్తుందని లేఖలో పేర్కొన్నారు. హిందుస్థానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ(Jitan Ram Manjhi)కు కూడా బీజేపీ(BJP) ఆహ్వానం పంపింది.
