ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) తనకు మించిన హిందుత్వ(Hinduism) వాది లేడని చెప్పుకునే ప్రయత్నం చేశారు

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) తనకు మించిన హిందుత్వ(Hinduism) వాది లేడని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంద్రకీలాద్రి(Indrakiladhri) కొండకు వెళ్లిన పవన్‌ అమ్మవారి ఆలయ మెట్లును శుద్ధి చేశారు. తర్వాత మెట్ల పూజ చేశారు. ఆ తర్వాత మీడియాతో ఆవేశంగా మాట్లాడారు. సనాతన ధర్మాన్ని భుజాన ఎత్తుకున్నారు. తిరుమల లడ్డూ అపవిత్రం అయ్యిందని మరోసారి విరుచుకుపడ్డారు. హిందు ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు. పనిలో పనిగా ప్రకాశ్‌రాజ్‌పై(Prakash raj) విమర్శలు చేశారు. తిరుమల అపవిత్రమైందని తాను అంటే అలా అనకూడదని ప్రకాశ్‌ రాజ్‌ అనడం మూర్ఖత్వమని అన్నారు. సెక్యూలరిజం(Secularism) ముసుగు వేసుకుని పిచ్చి కూతలు కూస్తే ఊరుకోబోమని అన్నారు. సనాతన ధర్మం కోసం ప్రాణమిస్తానని పవన్‌ అన్నారు. సెక్యూలరిజం అంటే వన్‌ వే కాదన్నారు. హిందుధర్మంపై జరుగుతున్న దాడి పట్ల ప్రతి ఒక్క హిందువు బాధపడుతున్నారన్నారు. విగ్రహాల శిరచ్చేధం జరిగితే మాట్లాడకూడదా అని అడిగారు పవన్‌. తమకు బాధ ఉండదా అని అని నిలదీశారు. పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై విమర్శలు చేశారు. సనాతన ధర్మం జోలికి రావద్దని ఆగ్రహం చెందారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story