తిరుమల(Tirumla) అపవిత్రం మీద మాట్లాడితే, హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్‌రాజ్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తిరుమల(Tirumla) అపవిత్రం మీద మాట్లాడితే, హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్‌రాజ్ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తాను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడానని, ఇందులో ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏమిటని నిలదీశారు. 'నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో(Tirupati) అపవిత్రం జరిగింది.. ఇలా జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుంది. తప్పు జరిగితే మాట్లాడకూడదా..? దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి. ఎవరికోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాశ్ రాజు అంటే నాకు గౌరవం ఉంది. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు.. మాట్లాడితే సెక్యూలరిజంకు విఘాతం అంటే ఎలా' అని పవన్ కల్యాణ్(pawan kalyan) ప్రశ్నించారు. సనాతన ధర్మంపై(Sanathan dharm) ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇస్లాం మీద మీరు మాట్లాడగలారా..? జీసెస్ మీద మాట్లాడగలరా? అని సూటిగా అడిగారు. ప్రతీసారి కూర్చోబెట్టి తాము డిఫెండ్ చేసుకోలేమని, నోటికొచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదని పవన్ హెచ్చరించారు. తిరుపతిలో లడ్డూ వివాదంపై సినీనటుడు ప్రకాశ్ రాజ్(Prakash raj) ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తూ.. 'మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు' అని ఎక్స్‌లో ప్రకాశ్‌రాజ్ రాసుకొచ్చారు. ప్రకాశ్‌రాజ్ చేసిన ఆ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించారు.