అధికారంలోకి వస్తే ఇష్టం వచ్చినట్లు చేయవచ్చని కొందరి భావిస్తున్నార‌ని జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. జ‌న‌సేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జగన్ తెచ్చిన పథకాలు, కార్యక్రమాలు కొత్తవి కాదన్నారు

అధికారంలోకి వస్తే ఇష్టం వచ్చినట్లు చేయవచ్చని కొందరి భావిస్తున్నార‌ని జనసేన(Janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. జ‌న‌సేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. జగన్(Jagan) తెచ్చిన పథకాలు, కార్యక్రమాలు కొత్తవి కాదన్నారు. వైసీపీ నేతలకు కనువిప్పు కలిగించేందుకే రాజ్యాంగ ప్రతి తెచ్చాన‌ని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు సిగ్గుపడాలి. మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టినా భరించాం. చేసే పని సరైందే అని ఐపీఎస్ అధికారులకు అనిపిస్తుందా? అని ప్ర‌శ్నించారు. పదవి, అధికారం.. ఎవరికీ శాశ్వతం కాదన్నారు. సొంత రాష్ట్రానికి వస్తున్న నన్ను అడ్డుకున్నారు. జగన్.. నీకు సీఎం పదవి ఉందని తెగ ఫీలై పోవద్దని.. ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జగన్.. నువ్వేమైనా పైన్నుంచి దిగొచ్చావా? నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత? ప్రతిపక్ష నేతలపై ఎన్ని కేసులు పెడతారు? కేసులు పెడితే భయపడతామా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. జగన్ కు వత్తాసు పలికే నేతలు కాస్త ఆలోచించుకోవాల‌న్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న బాబుకు హ్యాట్సాప్ చెబితే తప్పా? అని ప్ర‌శ్నించారు. త్వరలో ఢిల్లీ(Delhi) వెళ్తా.. ఏపీ పరిస్థితులను అమిత్ షా(amit Shah), నడ్డా(JP Nadda)లకు వివరిస్తాన‌ని తెలిపారు. అక్రమ అరెస్టులపై.. టీడీపీ(TDP)తో పొత్తుపై బీజేపీ(BJP) పెద్దలకు వివరిస్తాన‌ని వెల్ల‌డించారు.

మరోసారి జగన్ గెలిస్తే ప్రజలు భరించగలరా? అని ప్ర‌శ్నించారు. వైసీపీ(YSRCP) నేతల గురించి మాట్లాడుతూ.. మీ నాయకుడుది బలం కాదు.. పిచ్చ.. జగన్ మానసిక రోగి.. ఎయిమ్స్ నుంచి డాక్టర్ ను పంపించి జగన్ కు చెకప్ చేయించాల‌న్నారు. ఇంత పిచ్చి ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పొత్తుల గురించి నేను తహతహలాడను. మన ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండని శ్రేణుల‌తో అన్నారు. జైల్లో ఉన్న జగన్.. బయటకు వచ్చి ఏకు మేకై కూర్చున్నాడని.. టీడీపీ, జనసేన పొత్తు ధర్మాన్ని అందరూ పాటించండని సూచించారు. వైసీపీ అనేది ఏపీకి పట్టిన చీడ, పీడ.. దానిని పూర్తిగా రాష్ట్రం నుంచి లేకుండా చేయాలని అన్నారు.

జగన్ ను వరంగల్ లో తన్ని తరిమికొట్టారు. రాష్ట్రంలోన దుర్మార్గపు పాలన గురించి అందరూ ఆలోచించాలన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏం చేస్తే అది చెల్లదన్నారు. మా నేల మీద మమ్మల్ని అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంటారా? అని ప్ర‌శ్నించారు. మేం గొడవ కోసం రాలేదు.. యుద్ధం కావాలంటే కురుక్షేత్రం తప్పదని అన్నారు. మాపై తప్పుడు కేసులు, హత్యాయత్నం కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు(Chandrababu) ప్రజాస్వామికంగా ఉంటారు కాబట్టి నేను గౌరవిస్తాన‌న్నారు. అమిత్ షాను కలిసి రాష్ట్రంలోని పరిణామాలను వివరిస్తాన‌న్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు.

జగన్ క్రూరుడని ఆయనకు దగ్గరగా ఉండేవారు చెప్పారని తెలిపారు.అత్యాశతో అన్నీ తనకే కావాలని జగన్ భావిస్తారని అన్నారు. సమయం వచ్చినప్పుడు పవర్ షేరింగ్ పై మాట్లాడతామ‌న్నారు. ఎన్నికల్లో గెలిచాక రాజు ఎవరో.. మంత్రి ఎవరో తేలుతుందన్నారు. పొత్తులపై సమన్వయం కోసం మనోహర్(Manohar) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. మనం ఇంకా ఎన్డీయేలోనే ఉన్నాం.. జనసేన ఎన్డీఏ భాగస్వామి అని స్ప‌ష్టం చేశారు. జగన్ చెప్పింది విని అధికారులు తప్పులు చేయకండని.. మరో ఆరు నెలల్లో మేం అధికారంలోకి రాబోతున్నాం అని జోష్యం చెప్పారు.

Updated On 16 Sep 2023 9:23 PM GMT
Yagnik

Yagnik

Next Story