తెలుగుదేశం పార్టీతో(TDP) జతకట్టిన జనసేనాని(Janasena) పవన్‌ కల్యాణ్‌(Pawan kalayan) సీట్ల షేరింగ్‌లో పాతిక కంటే ఒక సీటు తక్కువకు మహాదానందగా ఒప్పుసుకున్నారు. ఇప్పుడు అభ్యర్థుల అన్వేషణలో పడ్డారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఎన్నికలకు ఎంతకాదనుకున్నా నెలన్నర రోజులే ఉంది. ఇప్పుడు జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో కూడా మెజారిటీ స్థానాలు టీడీపీ నుంచి వచ్చినవారికే దక్కబోతున్నాయి.

తెలుగుదేశం పార్టీతో(TDP) జతకట్టిన జనసేనాని(Janasena) పవన్‌ కల్యాణ్‌(Pawan kalayan) సీట్ల షేరింగ్‌లో పాతిక కంటే ఒక సీటు తక్కువకు మహాదానందగా ఒప్పుసుకున్నారు. ఇప్పుడు అభ్యర్థుల అన్వేషణలో పడ్డారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఎన్నికలకు ఎంతకాదనుకున్నా నెలన్నర రోజులే ఉంది. ఇప్పుడు జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో కూడా మెజారిటీ స్థానాలు టీడీపీ నుంచి వచ్చినవారికే దక్కబోతున్నాయి. హార్డ్‌కోర్‌ జనసైనికులకు దక్కబోతున్నది తొమ్మిదో పదో! చిత్రమేమిటంటే పవన్‌ తాను పోటీ చేసే స్థానంపై కూడా చంద్రబాబుపై(Chandrababu) ఆధారపడటం! ఇప్పుడు చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమని చెబితే పవన్‌ అక్కడ్నుంచి పోటీ చేయాలన్నమాట! 2019 ఎన్నికలప్పుడు పవన్‌ అంతర్గతంగా సర్వేలు చేయించుకున్నారు. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయనుకుని గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాలను ఎంపిక చేసుకున్నారు. పవన్‌కల్యాణ్‌కు అప్పుడు వామపక్షాలు, బీఎస్‌పీ మద్దతుగా నిలిచాయి. అయితే రెండు చోట్లా పవన్‌ ఓడిపోయారు. గాజువాకలో మొత్తం 1,99,314 ఓట్లు పోలయ్యాయి. వీటిల్లో పవన్‌కు వచ్చినవి కేవలం 58,539 ఓట్లు మాత్రమే! అలాగే భీమవరంలో 1,92,558 ఓట్లు పోలైతే, పవన్‌కు 62,285 ఓట్లు వచ్చాయి. గాజువాకలో 17 వేల ఓట్ల తేడాతో పరాజయపాలైతే, భీమవరంలో 8 వేల ఓట్లకు పైగా తేడాతో పవన్‌ ఓడిపోయారు. అందుకే ఈసారి కచ్చితంగా గెలిచే సీటు కోసం శోధిస్తున్నారు. ఇప్పటి వరకైతే గాజువాక, భీమవరం, పిఠాపురం స్థానాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకునేట్టుగా ఉన్నారని జనసైనికులు చెబుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే, తాను ఎక్కడ్నుంచి పోటీ చేయాలన్నది చంద్రబాబు నిర్ణయం మీద ఆధారపడి ఉండటం! పవన్‌ పోటీ చేసే నియోజకవర్గం పరిధిలోని లోక్‌సభ స్థానంలో తెలుగుదేశంపార్టీకి ఏ మేరకు లాభం కలుగుతుందో చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారు. పవన్‌ పోటీ చేసే స్థానం చుట్టుపక్కల టీడీపీ బలహీనంగా ఉండే స్థానాల కోసం చూస్తున్నారట! ఉమ్మడి విశాఖ జిల్లాలో గాజువాక నుంచి పవన్‌ను పోటీ చేయించాలన్నది బాబు ఆలోచనగా ఉందట! పక్షం రోజుల కిందట పవన్‌ భీమవరం పర్యటనకు వెళ్లారు. అప్పుడు టీడీపీ, బీజేపీ నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలిశారు. దాంతో ఈసారి పవన్‌ భీమవరం నుంచి పోటీ చేయడం గ్యారంటీ అని అనుకున్నారు. కానీ పవన్‌ పోటీ చేయకపోతే ఆ సీటు తనకు కేటాయించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయుడు అడుగుతున్నారట! దీనిపై చంద్రబాబు ఇంకా ఏమీ తేల్చుకోలేదు. ఆ మధ్యన పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే మాట వినిపించింది. దీనిపై కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

Updated On 4 March 2024 3:15 AM GMT
Ehatv

Ehatv

Next Story