Pawan Kalyan : కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కాకినాడ లోక్ సభ అభ్యర్థిని ప్రకటించారు.

Pawan Kalyan who announced the Kakinada MP candidate
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కాకినాడ లోక్ సభ అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన తరఫున టీ టైం ఉదయ్ శ్రీనివాస్ బరిలో దిగుతున్నాడని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాను అనుకున్న మార్పును ముందుగా పిఠాపురంలో చేసి చూపిస్తానని అన్నారు. దేశంలో అందరి దృష్టి పిఠాపురంపై పడేలా చేస్తానని పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ ని, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గట్టి మెజారిటీతో గెలిపించండి అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
